Asianet News TeluguAsianet News Telugu

రెండు వైపుల నుంచి అటాక్, విలవిలాడుతూ కేకలు పెట్టిన అమర్.. ఏం మనిషివే నువ్వు అంటూ రతికపై.. 

చాలా ఉత్కంఠ భరితంగా ఆగ్రహావేశాలు మధ్య జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో చివరకి ప్రియాంక విజయం సాధించి హౌస్ కి కొత్త కెప్టెన్ గా అవతరించింది. 

Priyanka Jain became new captain in Bigg Boss Telugu 7 dtr
Author
First Published Nov 17, 2023, 10:45 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో శనివారం ఎపిసోడ్ చాలా ఇంటెన్స్ గా జరిగింది. దీనికి కారణం కెప్టెన్సీ టాస్క్. చాలా ఉత్కంఠ భరితంగా ఆగ్రహావేశాలు మధ్య జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో చివరకి ప్రియాంక విజయం సాధించి హౌస్ కి కొత్త కెప్టెన్ గా అవతరించింది. 

ఎవిక్షన్ పాస్ టాస్క్ లో రిజల్ట్ కోసం అంతా ఎదురుచూశారు. చివరకి శోభా శెట్టి యావర్ విజేతగా నిలిచినట్లు ప్రకటించింది. దీనితో యావర్ కి ఎవిక్షన్ పాస్ పూర్తిగా సొంతం అయింది. ఎవిక్షన్ పాస్ రిజల్ట్ ప్రకటించక ముందు శోభా, శివాజీ గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే రిజల్ట్ తర్వాత గుడ్ డెసిషన్ అంటూ శివాజీ శోభాని అభినందించాడు. 

రిజిస్ట్ విషయంలో ఇంటి సభ్యుల మధ్య చాలా సమయం చర్చ జరిగింది. అలాగే శివాజీ గొడవ గురించి కూడా మాట్లాడుకున్నారు. అర్జున్ శోభాతో మాట్లాడుతూ.. శివాజీ ఎప్పుడూ రెండు విధాలుగా మాట్లాడతారు. ఎప్పుడు ఎలా అవసరమో ఆ వైపు జంప్ అయిపోతారు అని చెప్పాడు. శివాజీకి తప్పించుకోవడం బాగా తెలుసు అని గౌతమ్ కామెంట్ చేశాడు. 

అనంతరం బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ప్రారంభించారు. హౌస్ లో సభ్యులంతా కంటెండర్స్ గా పాల్గొన్నారు. అక్కడ అమర్చిన రూట్ లో వెళుతూ ఎక్కువ ఇటుకలు సేకరించాలి. ఒక్కొక్క రౌండ్ లో తక్కువ ఇటుకలు ఉన్న వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పుకుంటూ వస్తారు. ఎక్కువ ఇటుకలు కలిగి టాప్ 4 లో నిలిచిన వాళ్ళు లెవల్ 2 కి వెళతారు. ఆ విధంగా అమర్, ప్రియాంక, అర్జున్, ప్రశాంత్ ఎక్కువ ఇటుకలతో నెక్స్ట్ రౌండ్ కి అర్హత పొందారు. 

లెవల్ 2లో సేకరించిన ఇటుకలని టవర్ లాగా ఎత్తుగా పేర్చాలి. తక్కువ ఎత్తు ఉన్న వాళ్ళు తప్పుకుంటారు. ఇక చివరకి మిగిలింది ప్రియాంక, అమర్  మాత్రమే. వీళ్ళిద్దరూ కెప్టెన్ ఎవరో తేల్చేందుకు ఇతర సభ్యులు కూడా పాల్గొంటారు. ఎవరు కెప్టెన్ కాకూడదు అనుకుంటున్నారో వారి టవర్ పై బాల్స్ తో దాడి చేయొచ్చు. 

దీనితో గౌతమ్, రతిక లాంటి వాళ్ళు అమర్ టవర్ ని టార్గెట్ చేస్తూ బాల్స్ విసురుతారు. అమర్ దాచేసి ఆలోచించండి. నన్ను టార్గెట్ చేయొద్దు అంటూ వేడుకుంటాడు. కానీ అమర్ పై బాల్స్ దాడి జరుగుతూనే ఉంటుంది. దీనితో అమర్ పిచ్చి పట్టినట్లు కేకలు పెడుతాడు. ఒక వైపు నుంచి రతిక, మరోవైపు నుంచి గౌతమ్ టార్గెట్ చేయడంతో అమర్ సహనం కోల్పోతాడు. ఏం మనిషివే నువ్వు అంటూ రతికపై.. మిత్ర ద్రోహి అంటూ గౌతమ్ పై అమర్ గట్టిగా అరుస్తాడు. చివరకి ప్రియాంక నే విజయం సాధించి హౌస్ కి కొత్త కెప్టెన్ అవుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios