మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి బలైన ప్రియాంక సిక్కిం రాష్ట్రాన్ని కించపరిచేలా ప్రియాంక వ్యాఖ్యలు సిక్కిం గురించి తెలుసుకొని మాట్లాడాలన్న నెటిజన్లు

బాలీవుడ్ నటి ప్రియాంక చొప్రా పై మరోసారి నెటిజన్లు తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు తన దుస్తుల విషయంలో నెటిజన్ల ఆగ్రహానికి గురైన గ్లోబల్ స్టార్ ప్రియాంక చొప్రా.. మరోసారి విమర్శలు ఎదుర్కొంటోంది. వివరాల్లోకి వెళితే.. కెనడా రాజధాని టొరంటో కేంద్రంగా ఇటీవల అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రియాంక .. తాను నిర్మాతగా వ్యవహరించిన ‘పుహునా’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.

‘సిక్కిం ఈశాన్య భారతంలో ఒక చిన్న రాష్ట్రం. అక్కడ సినిమా పరిశ్రమ ఇప్పటివరకు లేదు. కనీసం సినిమాలు తీసేందుకు నిర్మాతలెవరూ కూడా ముందుకురారు. అందుకు కారణం నిత్యం అక్కడ జరిగే తిరుగుబాట్లు, గందరగోళాలు, అల్లర్లే కారణం. అక్కడ అల్లర్లు చెలరేగుతూ ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది. అయినా అతి కష్టం మీద అనేక ఇబ్బందులకు ఓర్చుకొని తన తొలి "పహునా" అనే చిత్రాన్ని చిత్రీకరించాం అంటూ, సిక్కిం నుంచి వచ్చిన తొలిచిత్రం "పహునా" మాత్రమే’ అంటూ ప్రియాంక వ్యాఖ్యానించారు.

 "సిక్కిం నుంచి ఇతర ప్రాంతాల కు వలస వెళ్తున్న క్రమంలో ఇద్దరు చిన్నారి శరణార్థుల మధ్య చోటు చేసుకునే పరిణామాల నేపధ్యంలో పహునా సినిమాని తెరకెక్కించారు. "పహునా"కు 'టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌'లో ప్రశంసలు బాగా దక్కాయి. ఆ అత్యుత్సాహం తో సిక్కిం రాష్ట్రం అల్లర్లకు కేంద్రం గా మారిపోయిందంటూ ప్రియాంక చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో ఆమెపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. సిక్కిం చాలా ప్రశాంతతో కూడుకున్న రాష్ట్రమని కొందరు ఆమెపై విరుచుకు పడగా, అసలు సిక్కిం ఎక్కడ ఉందో? ఎలా ఉంటుందో? ప్రియాంకకు తెలుసా? అంటూ మరి కొందరు సెటైర్ల తో ప్రశ్నిస్తున్నారు. సిక్కిం ఫిల్మ్‌ ఇండస్ట్రీ గురించిన నిజాలు తెలుసుకుని మాట్లాడాలని కొందరు ప్రియాంకపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు సిక్కిం చైనా భారత్ మద్య నలిగిపోతున్న తరుణం లో అంటే 1971 లోనే విశ్వవిఖ్యాత భారతీయ దర్శకుడు సత్యజిత్ రాయ్ "ఇరు దేశాల మద్య నలిగిపోతున్న లేగ దూడాలా ఉన్న్న సిక్కిం పై ఒక డాక్యుమెంటరీ చిత్రాన్నినిర్మించారు. దాన్ని భారత్ బాన్ చేసింది. కాని సిక్కిం భారత్ లో విలీనమైన తరవాత 1975 లో బాన్ ను తొలగించి ఆ సినిమాను కల్చర్ & టూరిజం శాఖకు అప్పగించారు. దాని క్వాలిటికి ఆశ్చర్య పోయిన బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్ట్ ట్యూట్ దానిని సంపాదించి అకాడమీ ఆఫ్ ఫిల్మ్ ఆర్చైవ్స్ లో భద్రపరచారు. అంతటి చరిత్ర ఉన్న సిక్కిం సినిమా రంగాన్ని తన నోటి దూలతో కించపరచారు ప్రియాంక.