ప్రియాంక చోప్రా విలాసాలకు ఆకాశమే హద్దుగా ఉంది. తన భర్తతో కలసి పీసీ తరచుగా విహారయాత్రల్లో విహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ జంట ఇటలీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. 

స్విమ్మింగ్ పూల్ లో బికినిలో అందాలు ఆరబోస్తున్న ప్రియాంక చోప్రా తన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చేతిలో డ్రింక్ పట్టుకుని ఉన్న ప్రియాంక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెకేషన్ ని అద్భుతంగా ఎంజాయ్ చేయడం అంటే ఇదే.. నా భర్తే ఈ ఫోటోలు తీశాడు అని ప్రియాంక కామెంట్ పెట్టింది. 

ప్రియాంక, నిక్ జోనస్ గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. ప్రియాంక ఇటీవల హాలీవుడ్ లో కూడా పాపులర్ అయింది. ప్రస్తుతం ప్రియాంక సోనాలి బోస్ దర్శకత్వంలో ది స్కై ఈజ్ పింక్ అనే చిత్రంలో నటిస్తోంది.