గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా తాజాగా ఓ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది. ఈమె పలు రకాల డ్రెస్ లు వేసుకొని ఫోటోషూట్ లో పాల్గొంది కానీ అన్నింటికంటే ఎక్కువగా ఆకర్షించి మాత్రం ఆమె చీర ధరించిన ఫోటోలు. 

చీర అంటే సంప్రదాయ కట్టు అని మాత్రం భావించకండి. ఎందుకంటే ప్రియాంక చోప్రా ఇంటర్నేషనల్ స్టైల్ లో చీరకి కొత్త అర్ధం తీసుకొచ్చింది. బ్లౌజ్ లేకుండా చీర ధరించిన బ్యాక్ లెస్ గా ఫోటోలకు ఫోజిచ్చింది.

ఈ ఫోటోలకు సోషల్ మీడియా విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆ ఫోటో షూట్ సమయంలో తీసిన ఓ వీడియో క్లిప్ బయటకి రావడంతో ఇప్పుడు ట్రోలర్లకు పెద్ద పని పడింది. ఒక్కొక్కరూ ప్రియాంకను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇండియన్ చీరకి ఏం కర్మ పట్టిందని' ఒకరు అంటుంటే మరొకరు 'బ్లౌజ్ వేసుకోవడం మర్చిపోయి వచ్చిందని' అంటున్నారు.

తాగి ఫోటో షూట్ లో పాల్గొని ఉంటుందని, ఇలాంటి బట్టలు వేసుకోవడానికి కొంచెం కూడా సిగ్గు లేదా అంటూ ప్రియాంకను తిట్టిపోస్తున్నారు. ఇలాంటి ట్రోలింగ్ ప్రియాంకకు కొత్తేమీ కాదు. రీసెంట్ గా మెట్ గాలాలో కూడా ఓ విచిత్రమైన డ్రెస్ వేసుకొని ట్రోలింగ్ కి గురైంది ఈ  బాలీవుడ్ బ్యూటీ.