బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి చెక్కేసిన ప్రియాంక అక్కడ సినిమాలు, సిరీస్ లు చేస్తూ సూపర్ బిజీ అయ్యారు. హాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న ప్రియాంక చోప్రా న్యూయార్క్ నగరంలో సెటిల్ అయ్యింది. కొన్నాళ్ల క్రితం న్యూయార్క్ నగరంలో కొత్త ఇల్లు కొన్న ఆమె, భర్త నిక్ తో నివాసం ఉంటున్నారు. అమెరికన్ సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనాస్ తో కొన్నాళ్ళు డేటింగ్ చేసిన ప్రియాంకా చోప్రా 2018 డిసెంబర్ లో ఘనంగా వివాహం జరుపుకున్నారు. గత రెండేళ్లుగా ఈ జంట హ్యాపీ లైఫ్ గడుపుతున్నారు. 38ఏళ్ల ప్రియాంక తనకంటే పదేళ్ల చిన్నవాడిని పెళ్లి చేసుకోవడం విశేషం. 

 
 
తన కంటే వయసులో చిన్న వాడిని చేసుకున్న ప్రియాంక అనేక విధాలుగా ట్రోల్స్ కి గురయ్యారు. ఎవరు ఏమనుకున్నా ప్రియాంక, నిక్ జోనాస్ మేడ్ ఫర్ ఈచ్ అథర్ అనిపిస్తున్నారు. ఐతే ప్రియాంక సడన్ గా భర్తపై తీవ్ర కోపానికి గురయ్యారు. నడిరోడ్డులో అందరూ చూస్తుండగానే కారు నుండి బయటికి తోసేశారు. మరి ప్రియాంక అలా చేయడానికి కారణం ఏమిటంటే.. ఓ సినిమా షూటింగ్ కోసమే. ఇది రియల్ గొడవ కాదు, కేవలం రీల్ గొడవ మాత్రమే. 
 
ప్రియాంక చోప్రా టెక్స్ట్ ఫర్ యూ అనే ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో ప్రియాంక భర్త నిక్ జోనాస్ చిన్న క్యామియో రోల్ చేయడం జరిగింది. ఆ చిత్ర షూటింగ్ లో భాగంగా నిక్ ని ప్రియాంక కోపంగా కారులో నుండి బయటికి నెట్టేసింది. ఇక ప్రస్తుతం వి కెన్ బి హీరోస్ అనే సూపర్ హీరో చిత్రంతో పాటు ప్రఖ్యాత మ్యాట్రిక్స్ సిరీస్ లో వస్తున్న తదుపరి చిత్రంలో ప్రియాంక నటిస్తున్నారు. అలాగే ది వైట్ టైగర్ అనే హిందీ చిత్రంలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారు.