రిచర్డ్ మ్యాడెన్ (Richard Madden) ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ సైన్స్ ఫిక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ గా ఈ సిటాడెల్ ఏప్రిల్ 28 నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చింది.
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి వెళ్లి అక్కడే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ భామ సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. రిచర్డ్ మ్యాడెన్ (Richard Madden), ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కీలక పాత్రలు పోషిస్తున్న వెబ్‌సిరీస్ ‘సిటాడెల్’ (Citadel). స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. ‘అవెంజర్స్’ ఫేమ్ రుస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించారు. అమెజాన్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ షోలో రిచర్డ్, ప్రియాంక గూఢచారులుగా కనిపిస్తున్నారు. ట్రైలర్ తో ఓ రేంజిలో క్రేజ్ తెచ్చుకున్న ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతందిది. ఏప్రిల్ 28న రెండు ఎపిసోడ్స్‌ను ప్రేక్షకులకు అందుబాటులో ఉంచారు. అనంతరం వచ్చే ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేసారు. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ లో ప్రస్తుతం 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ఈ నేపధ్యంలో సిటాడెల్ అంచనాలును అందుకుందా ఎలా ఉందో చూద్దాం.
రిచర్డ్ మ్యాడెన్ (Richard Madden) ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ సైన్స్ ఫిక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ గా ఈ సిటాడెల్ ఏప్రిల్ 28 నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన తరువాత మిక్స్‌డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ, మొదటి నుంచి ఉన్న బజ్ తో ఈ సిరీస్ వరల్డ్ టాప్ సిరీస్ గా నిలిచింది. VOD (Video-On-Demand) ట్రాకింగ్ పోర్టల్ రిపోర్ట్ ప్రకారం ఏప్రిల్ 29న ఎక్కువ వ్యూయర్ షిప్ సంపాదించి ఫస్ట్ ప్లేస్ ని సొంత చేసుకుంది. దీని తరువాత నెట్‌ఫ్లిక్స్ – స్వీట్ టూత్ (Sweet Tooth), ప్రైమ్ వీడియో – ది మార్వెలస్ మిస్ మైసెల్ (The Marvelous Mrs Maisel), నెట్‌ఫ్లిక్స్ – ది డిప్లొమాట్ (The Diplomat), ప్రైమ్ వీడియో – పవర్ స్టారింగ్ టోనీ కాలీట్ (Power starring Toni Collette) సిరీస్ లు తరవాతి స్థానంలో నిలిచాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి కేవలం 40 నిమిషాలు మాత్రమే ఉంది. కాబట్టి రెండు ఎపిసోడ్లను గంటన్నర లోపే స్ట్రీమ్ చేయవచ్చు.
ఈ సీరిస్ కథ ప్రకారం... గ్లోబల్ స్పై ఏజెన్సీ సిటాడెల్‌కు చెందిన టాప్ ఏజెంట్లు మేసన్ కేన్ (రిచర్డ్ మాడెన్), నాదియా సిన్హ్ (ప్రియాంక చోప్రా). వాళ్లిద్దరూ ఒక సీక్రెట్ మిషన్ మీద వెళ్తే అది తమ కోసం వేసిన ట్రాప్ అని అర్దమవుతుంది. ఆ ట్రాప్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో జరిగిన ప్రమాదంలో మేసన్ తన గతాన్ని మర్చిపోతాడు. ఆ సమయంలోనే సిటాడెల్ కూడా అంతం అయిపోతుంది. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత సిటాడెల్ ఏజెంట్ల వివరాలు, న్యూక్లియర్ కోడ్స్ ఉన్న ఒక బ్లాక్ బాక్స్ సీఐఏకి దొరికిందని ‘మాంటికోర్’ అనే టెర్రరిస్ట్ సంస్థకు తెలుస్తుంది. వారు కూడా ఆ బాక్స్ కోసం ఎప్పటినుంచో వెతుకుతూ ఉంటారు. అనుకోకుండా ఈ గేమ్‌లోకి మేసన్ కేన్ తిరిగి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? నాదియా ఏం అయింది? అనేది మిగతా ఎపిసోడ్స్ కూడా చూడాలి. అసలు వీళ్లని ట్రాప్ చేసింది ఎవరు..వీళ్లిద్దరూ కలిసి ప్రపంచాన్ని ఎలా రక్షించారనే క్యూరియాసిటి పాయింట్ ని ఈ ఎపిసోడ్స్ వదిలాయి.
ఇక ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్‌ను ఇండియాలో రీమేక్ చేస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ మేకర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. సమంత రుత్ ప్రభు, వరుణ్ ధావన్ కీలక పాత్రలు పోషించారు. రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్నారు. ఈ షో షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. ‘సిటాడెల్’ ఇండియా వెర్షన్ గురించి కూడా మొదటి ఎపిసోడ్‌లో చిన్న టీజ్ ఇచ్చారు. అయితే చాలా మంది అభిమానులు మాత్రం ఈ సీరిస్ పై చాలా హోప్స్ పెట్టుకున్నామని, ఆ స్దాయిలో లేదని తేల్చేస్తున్నారు.
