ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయంగా సాధించిన విజయాలు.. ముఖ్యంగా ఆస్కార్ అవార్డు సాధించడం ఇండియన్ సినిమాకి గర్వకారణం. తెలుగు వారికి, తెలుగు సినిమాకి ఆర్ఆర్ఆర్ ఇంకా గౌరవం పెంచింది.
ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయంగా సాధించిన విజయాలు.. ముఖ్యంగా ఆస్కార్ అవార్డు సాధించడం ఇండియన్ సినిమాకి గర్వకారణం. తెలుగు వారికి, తెలుగు సినిమాకి ఆర్ఆర్ఆర్ ఇంకా గౌరవం పెంచింది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే ముద్రని ప్రపంచ వ్యాప్తంగా జక్కన్న చెరిపేశారు.
అయితే ఇప్పటికి కొందరు ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని బాలీవుడ్ చిత్రం అనో, తమిళ చిత్రం అనో పొరపాటు పడడం చూస్తూనే ఉన్నాం. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ సాధించడంతో ప్రియాంక చోప్రా అభినందనలు తెలిపింది. చిత్ర యూనిట్ కి ఆమె ఆస్కార్ వేడుక ముందు పార్టీ కూడా ఇచ్చింది. అయితే ఈ గ్లోబల్ బ్యూటీ ఇటీవల మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ తమిళ చిత్రం అని పొరపాటుగా అభివర్ణించింది.
దీనితో నెటిజన్లు ప్రియాంక చోప్రాని దారుణంగా ట్రోల్ చేశారు. ఇండియన్ సినిమాలో స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రాకి ఒక తెలుగు సినిమాకి, తమిళ చిత్రానికి తేడా తెలియదా అంటూ నెటిజన్లు విమర్శించారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా సిటాడెల్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. త్వరలో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుండడంతో ప్రియాంక ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
ఆర్ఆర్ఆర్ వివాదంపై స్పందిస్తూ.. నేను ఏం మాట్లాడినా అందులో తప్పులు వెతికితే ఎలా అని ప్రశ్నించింది. కొందరికి అదే పనిగా ఉంది. నాలో తప్పులు వెతికి విమర్శించడం వల్ల ఆనందం పొందుతున్నారు అంటూ ఘాటుగా బదులిచ్చింది. ఆర్ఆర్ఆర్ గురించి పొరపాటుగా అలా చెప్పానని ప్రియాంక చోప్రా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రియాంక తాజాగా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
