ప్రముఖ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. సింగర్, నటుడు అయిన నిక్ జోనస్ ని ప్రేమించిన సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి నిశ్చితార్ధం కూడా జరిగింది. త్వరలోనే ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. ఇప్పుడు ప్రియాంకకు కాబోయే మామగారు, నిక్ జోనస్ తండ్రి పౌల్ జోనస్ దివాలా తీశారంటూ.. కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి పౌల్ జోనస్ కోటీశ్వరుడు.

మరి దివాలా తీయాల్సిన పరిస్థితి ఎందుకు కలిగిందనే విషయంలోకి వెళ్తే.. పౌల్ జోనస్ కి 'న్యూజెర్సీ' అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. అయితే ఆ కంపెనీ మీద ఇప్పటికే ఒక మిలియన్ డాలర్ అప్పుతో కేసు ఉందట. దీనిపై కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ డబ్బుపై మరికొంత సొమ్ము జరిమానాగా చెల్లించాల్సి వస్తున్నట్లు సమాచారం. దీంతో అతడి కంపెనీకి చెందిన ఆస్తులను అమ్మడమే కాన దివాలా దస్తావేజు దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ 28 మిలియన్ డాలర్లు. ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే.. ఆయన కుమారులు మాత్రం సంగీత ప్రపంచంలో దూసుకుపోతున్నారు. మొదట్లో జోనస్ బ్రదర్స్ అనే పేరుతో మ్యూజిక్ బ్యాండ్ పెట్టి సంపాదించేవారు. ఆ తరువాత ఎవరికీ వారు విడిపోయి సొంతంగా తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు.