బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ స్టార్ నిక్ ను పెళ్ళి చేసుకుని, సరోగసి ద్వారా ఒక పాపకు జన్మనిచ్చింది. కాని ఇంత వరకూ పాపకు సంబంధించిన ఏ విషయాన్ని ఆమె ఫ్యాన్స్ తో పంచుకోలేదు. ఫస్ట్ టైమ్ ప్రియాంక తన కూతురు గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.

బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తొలిసారి తన కూతురి గురించి స్పందించింది. తల్లిగా తాను ఏం చేయాలనుకుంటున్నది, పెంపకం గురించి చెప్పింది. ఈ ఏడాది జనవరిలో ప్రియాంక, నిక్ జోనాస్ దంపతులకు సరోగసి ద్వారా పాప పుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లిల్లీ సింగ్ అనే జర్నలిస్ట్ కొత్త పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్న నేపథ్యంలో.. ఆమె ప్రియాంకచోప్రాతో సంభాషించారు. ఈ సందర్భంగా ప్రియాంక తన కూతురు గురించి కోన్ని విషయాలు పంచుకున్నారు.
ఓ తల్లిగా తన భయాలు, కలలు, ఆశయాలను తన బిడ్డపై ఎట్టిపరిస్థితుల్లోనూ రుద్దబోనని చెప్పింది. పిల్లలు ఎప్పుడైనా మన ద్వారా మాత్రమే వస్తారుగానీ.. మన నుంచి రారు అని చెప్పుకోచ్చింది ప్రియాంక. పిల్లలు మన ద్వారా వచ్చి వారి జీవితాన్ని నిర్మించుకుంటారంటుంది బాలీవుడ్ బ్యూటీ. ఇదే సిద్ధాంతాన్ని తన కూతురు విషయంలో ఫాలో అవుతానంటోంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పింది.
తన తల్లిదండ్రులు తనపై ఎప్పుడూ తన మీద ఆధిపత్యం చూపించలేదని, తనను స్వతంత్రంగా ఉండనిచ్చారని చెప్పింది. కాగా, ప్రియాంక చోప్రా తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే కావడంతో ప్రియాంక విషయంలో.. జాగ్రత్తగా అడుగులు వేశారు. తల్లి మధు చోప్రా, తండ్రి దివంగత అశోక్ చోప్రా ఇద్దరూ ఆర్మీలో వైద్యులుగా పనిచేశారు.