బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పార్టీ చేసుకునేందుకు రెడీ అవుతోంది. 2000 సంవత్సరంలో ప్రియాంక మిస్‌ ఇండియా కిరీటాన్ని అందుకుంది. తరువాత అదే ఏడాది మిస్‌ వరల్డ్‌గా కూడా ప్రూవ్ చేసుకుంది. ఆ సమయంలో ప్రియాంక వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే.

తాజాగా అప్పటి సంఘటనను గుర్తు చేసుకుంటూ ప్రియాంక  చోప్రా ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసింది. వీడియోతో పాటు `అసలు ఆ రోజు నేను ఏం ధరించాను. నా తలపై పెట్టిన ఆ కిరీం ఏంటి? ఆ జుట్టు ఏంటి? అప్పుడు చాలా జుట్టు ఉంది.? ఇప్పుడు ఆ జుట్టు ఏం అయ్యింది? అంటూ కామెంట్ చేసింది.

అంతేకాదు మిస్‌ ఇండియా పోటీల్లో భాగంగా తనుకు ఎదురైన ప్రశ్నను కూడా గుర్తు చేసుకుంది ప్రియాంక. `నువ్వు దేవుడివి అయితే, ఆడమ్‌, ఈవ్‌, సాతాన్‌లలో ఎవరిని శిక్షిస్తావు? అన్న ప్రశ్నకు సమాధానంగా `దెయ్యం అనేది ఆలోచన మాత్రమే` అంటూ సమాధానం ఇచ్చింది. `ఈ ప్రయాణం ఇక్కడే మొదలైంది. మీరు ఇది గతంలో ఎప్పుడూ చూడలేదు. మీ కోసం చిన్న ట్రీట్`  అంటూ కామెంట్ చేసింది ప్రియాంక.