గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. ప్రముఖ హాలీవుడ్ సింగర్ నిక్ ని పెళ్లి చేసుకొని అమెరికాలో నివాసముంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట కొత్త ఇల్లు తీసుకోవాలని భావిస్తున్నారు. ఆ ఇంటి కోసం ఏకంగా 20 మిలియన్ డాలర్లు బడ్జెట్ పెట్టుకున్నారు.

అమెరికాలోని హాలీవుడ్ కొలువైన్ లాస్ ఏంజిల్స్ లో ఓ అందమైన ఇంటిని సొంతం చేసుకోవడానికి ఈ జంట తీవ్రంగా ప్రయత్నిస్తుందని ఓ వెబ్ సైట్ కథనం ప్రచురించింది. నిక్ జోనస్ పెళ్లికి ముందు లాస్ ఏంజిల్స్ లో బెవర్లీ హిల్స్ లో ఉండేవాడు. 

ఆ ఇంటిని 6.5 మిలియన్ డాలర్లు పెట్టి సొంతం చేసుకున్నాడు. ఐదు బెడ్‌రూమ్‌లు, నాలుగుకు పైగా బాత్‌రూమ్‌లు, అద్భుతమైన స్విమ్మింగ్‌ పూల్‌, కిటికిలోంచి చూస్తే మంచి వ్యూ పాయింట్స్, ప్రకృతి కనిపించేలా ఉన్న ఈ విలాసవంతమైన ఇంటిని నిక్‌ ఇటీవల 6.9 మిలియన్‌ డాలర్లకు అమ్మేశాడు.

ఇప్పుడు ఈ జంట మరింత ఖరీదైన ఇంటిని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. వారు కోరుకుంటున్నట్లుగా ఇల్లు దొరుకుతుందేమో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ ప్రాజెక్ట్ లతోనే బిజీగా గడుపుతోంది.