హాలీవుడ్‌ స్టార్‌ని మ్యారేజ్‌ చేసుకున్నా.. ఇండియన్‌ ట్రెడిషన్‌ని మర్చిపోవడం లేదు గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా. తాజాగా ఈ సెక్సీ భామ ఉత్తరాధిలో ప్రముఖంగా పూజించే కార్వా చౌత్‌ పూజా కార్యక్రమంలో పాల్గొంది. శివుడి వద్ద పూజ చేసింది. తాజాగా ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. మరోవైపు భర్త నిక్‌ జోనాస్‌తో కలిసి ఘాటు ఫోటోకి పోజిచ్చింది. 

ఇందులో రెడ్‌ శారీలో కనువిందుగా ఉంది ప్రియాంక. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ముస్తాబైంది. అందులోనూ కాస్త ఫారెన్‌ కల్చర్‌ని జోడించింది. ఈ ఫోటోలను పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. కార్వా చౌత్‌ ఫెస్టివల్‌ శుభాకాంక్షలు తెలిపింది. భర్త బాగు కోసం ఈ పూజలను చేస్తారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక మంది సెలబ్రిటీలు ఈ పండుగలో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఎర్రని చీరలను ధరించి కనువిందుగా నిలిచారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy Karwa Chauth to everyone celebrating.❤️ I love you @nickjonas

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Nov 4, 2020 at 9:28pm PST