ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురయినట్టు అనట్టు.. ఎన్నో ఏళ్ళుగా అభిమానులు ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా అభిమానుల ఆశలు నిజం చేస్తూ.. దాదాపు మూడేళ్ల తరువాత ఇండియాలో అడుగు పెట్టారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మూడేళ్ల తర్వాత భారత్ కు వచ్చారు. సోమవారం రాత్రి ముంబై ఎయిర్ పోర్టులో దిగిన ప్రియాంకకు అభిమానులు ఆనందంతో గెంతులు వేసుకుంటూ.. ఆత్మీయంగా.. ప్లకార్డులతో స్వాగతం పలికారు. ఇక ప్రియాంక చోప్ర తన భర్త నిక్ జోనస్, కూతురుతో కలిసి ఇండియా వచ్చారు.
ప్రియాంక చోప్ర పెళ్లి తర్వాత భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్‌లో సెటిలైంది. అప్పటి నుంచి ఇండియాలో అడుగు పెట్టలేదు ప్రియాంక. ఏ విషయం అయినా సరే సోషల్ మీడియా ద్వారా స్పందించడం తప్పించి ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకున్న ప్రియాంక.. ఇప్పుడే ముంబై వచ్చారు.
కరోనా లాక్ డౌన్ తర్వాత దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోవడం, క్వారంటైన్ ఆంక్షల నేపథ్యంలో ముంబై రావడానికి వీలు పడలేదు అంటోంది ప్రియాంక. అంతే కాదు ఈ టూర్ కు సంబంధించిన వివరాలను ప్రియాంక అంతకుముందే ఇన్ స్టా లో వెల్లడించారు. బోర్డింగ్ పాస్ కు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ.. దాదాపు మూడేళ్ల తర్వాత ఇంటికి వెళుతున్నానంటూ అందులో చెప్పారు.
రాక రాక ప్రియాంక చోప్ర ఇండియాకు రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటన్నారు. తమ అభిమాన నటిని డైరెక్ట్ గా చూడాలి అన్న ఆరాటంతో.. ఫ్యాన్స్ ముంబయి చేరుకుంటున్నారు. ప్రియాంక కూడా ఫ్యాన్స్ కోసం ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుని వచ్చింది. అభిమానులను అలరించడమే ముఖ్యం అంటోంది.
2017 లో బేవాచ్ సినిమాతో ప్రియాంక చోప్రా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడే నిక్ జోనస్ ప్రేమలో పడింది ప్రియాంక. ఎక్కుగా నాన్చకుండా ఈ జంట 2018లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి భర్తతో కలిసి ప్రియాంక లాస్ ఏంజిల్స్ లోనే ఉంటున్నారు. అంతే కాదు వాళ్లకు సంబంధించిన ప్రతీ ఈవెంట్ ఫోటోస్ ను ప్యాన్స్ తో శేర్ చేసుకుంటూనే ఉంది బ్యూటీ.
నిక్ జోనస్, ప్రియాంక చోప్రా దంపతులు రిసెంట్ గా సరోగసి పద్ధతిలో ఓ బిడ్డకు జన్మనిచ్చారు. భర్త, కూతురితో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ..ముఖం కనిపించకుండా కవర్ చేశారు. ఇక ఆమె ఎప్పుడెప్పుడు ఇండియాకు వస్తుందా అని.. ప్యాన్స ఎదురుచూస్తున్నారు. వారి కోరిక ఇన్నాళ్ళకు నెరవేరందింటున్నారు ప్యాన్స్.
