బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 

బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం జరిగి 120 రోజులు కూడా గడవకముందే ఈ జంట విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు 'ఓకే' మ్యాగజైన్ వార్తను ప్రచురించింది.

ఇద్దరికీ చాలా విషయాల్లో మనస్పర్ధలు వస్తున్నాయని, నిక్ కుటుంబానికి ప్రియాంక ప్రవర్తన ఎంత మాత్రం నచ్చడం లేదని ప్రతీ విషయంలో నిక్, ప్రియాంకలు గొడవ పడుతున్నారని కథనం ప్రచురించింది. అయితే ఈ వార్తలపై ప్రియాంక చెల్లెలు పరినీతి చోప్రా ఫైర్ అయింది. గిట్టనివాళ్లు చేస్తున్న పని ఇదని మండిపడింది.

జనాలను ఫూల్స్ చేయడానికి మా కుటుంబమే దొరికిందా అంటూ అసహనం వ్యక్తం చేసింది. వారిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని, ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారని.. ప్రస్తుతం జోనాస్ బ్రదర్స్ తో మియామీలో పార్టీ చేసుకుంటూ హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పింది.

ప్రియాంక ఈ విషయంపై నేరుగా స్పందించనప్పటికీ ఆ కథనం రాసిన మ్యాగజైన్ పై దావా వేయాలని అనుకుంటున్నారట. ఈ విషయాన్ని ప్రియాంక సన్నిహితులు ఓ వెబ్ సైట్ కి చెప్పినట్లు సమాచారం.