గతేడాది  ప్రియమణి `నారప్ప`, `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వంటి సినిమా, వెబ్‌ సిరీస్‌తో మెప్పించింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె తెలుగు ఓటీటీ  యాప్‌ `ఆహా`లో వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. 

ప్రియమణి(Priyamani) మల్టీపుల్‌ మాధ్యమాల్లో తన సత్తాని చాటుతుంది. ఓ వైపు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూ, మరోవైపు వెబ్‌ సిరీస్‌లు, ఇంకో వైపు టీవీ షోస్‌, దీంతోపాటు ఓటీటీ ఫిల్మ్స్ ఇలా ఏ ఛాన్స్ వచ్చినా వదులుకోవడం లేదు. నటిగా తనని తాను నిత్యం బిజీగా ఉంచుకుంటూ, నిత్యం మల్టీపుల్‌ మాధ్యమాల్లో ఆడియెన్స్ ని, తన అభిమానులను అలరిస్తుంది. 

గతేడాది Priyamani `నారప్ప`, `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వంటి సినిమా, వెబ్‌ సిరీస్‌తో మెప్పించింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె తెలుగు ఓటీటీ యాప్‌ `ఆహా`లో వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. `భామా కలాపం` (Bhama Kalapam) పేరుతో రూపొందుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ఇందులో ఆమె యూట్యూబ్‌లో వంటకాలు చేసే కుక్కింగ్‌ మహిళగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. 

`వెయ్యిమంది సబ్‌స్క్రైబర్స్, వెయ్య రకాల రెసిపీస్‌.. ప్రతి వారం ఓ కొత్త వంట. కానీ ఇప్పుడు చేయబోయే వంట చాలా స్పెషల్‌. ఎందుకంటే ఈ వంట ఎలా చేయాలో నాక్కూడా తెలియదు` అంటోంది ప్రియమణి. ఈ సందర్భంగా ప్రియమణి పెద్ద కత్తి పట్టుకుని దేన్నో కొడుతుండగా, ఆ సమయంలో ఆమెకి చెమటలు పట్టడం సస్పెన్స్ ని క్రియేట్‌ చేస్తుంది. ఈ సందర్భంగా `ప్రియమణి ఏం వండుతున్నారో తెలియదు కానీ, మనకి మాత్రం ఒక మంచి కామెడీ థ్రిల్లర్‌ ని వడ్డిస్తారు` అని ఆహా పంచుకున్న క్యాప్షన్‌ ఆకట్టుకుంటుంది. 

YouTube video player

`డియర్‌ కామ్రేడ్‌` ఫేమ్‌ భరత్‌ కమ్మ సమర్పణలో అభిమాన్యు దర్శకత్వం వహించిన `భామా కలాపం` కి బాపినీడు, సుధీర్‌ ఈదర నిర్మిస్తున్నారు. త్వరలో ఇది `ఆహా`లో స్ట్రీమింగ్‌ కాబోతుంది. ప్రస్తుతం ప్రియమణి సినిమాల పరంగా `విరాటపర్వం`, `మైదాన్‌`, `సైనాయిడ్‌`, `డాక్టర్‌ 56`, `కొటేషన్‌ గ్యాంగ్‌`, `ఖాయమరా`తోపాటు అట్లీ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.