Asianet News Telugu

'రాధే శ్యామ్':ప్రియదర్శి చెప్పిన ఇంట్రస్టింగ్ సంగతులు..!

ఈ చిత్రం విశేషాలను అందులో కీలక పాత్ర పోషిస్తున్న ప్రియదర్శి మీడియాతో షేర్ చేసుకున్నారు. తన పాత్రమిటి...ఏం చేస్తూంటాడు,హీరో,హీరోయిన్స్ తో తను ఉండే సీన్స్ ఏమిటనేవి చెప్పుకొచ్చాడు.
 

Priyadharsi about Prabhas Radhe Shyam jsp
Author
Hyderabad, First Published Jun 16, 2021, 7:32 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రభాస్‌, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై ‘జిల్‌’ఫేమ్‌ రాధాకృష్ణ దర్వకత్వంలో ఈ అందమైన ప్రేమకావ్యం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా ఆప్డేట్స్ వచ్చాయి. అయినా ఈ సినిమా సంగతులు గురించి అభిమానులు ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నారు. తాజాగా ఈ చిత్రం విశేషాలను అందులో కీలక పాత్ర పోషిస్తున్న ప్రియదర్శి మీడియాతో షేర్ చేసుకున్నారు. తన పాత్రమిటి...ఏం చేస్తూంటాడు,హీరో,హీరోయిన్స్ తో తను ఉండే సీన్స్ ఏమిటనేవి చెప్పుకొచ్చాడు.

ప్రియదర్శి మాట్లాడుతూ...'రాధే శ్యామ్' ఒక గ్రేట్ సినిమాటిక్ ఎక్సపీరియన్స్ అని ఇందులో తన పాత్ర కామెడీ టచ్ తో ఉంటుందని చెప్పాడు. అలాగే  తనది హీరోయిన్ పూజా హెగ్డేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసే పాత్ర అని దర్శి చెప్పాడు. తనకు ప్రభాస్ అన్నకు మధ్య మంచి కామెడీ సీన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ప్రభాస్ తనను స్వీట్ హార్ట్ అని పిలుస్తాడని.. ఆయనతో ఎక్కువ సమయం గడపాలని మాట్లాడాలని అనిపిస్తుందని.. ప్రభాస్ ఆతిథ్యాన్ని తాను ఎప్పటికీ మరచిపోలేనని ప్రియదర్శి అన్నారు.  
  
భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్‌’పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాను అధికభాగం ఇటలీలోనే చిత్రీకరించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందిస్తున్నాడు.  

నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, స‌త్య‌రాజ్‌, భాగ్య‌శ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, భీనా బెన‌ర్జి, ముర‌ళి శ‌ర్మ‌, శాషా ఛ‌త్రి, ప్రియ‌ద‌ర్శి, రిద్దికుమార్‌, స‌త్యాన్ త‌దిత‌రులు సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస  ఎడిటర్ :  కొటగిరి వెంక‌టేశ్వ‌రావు యాక్ష‌న్‌, స్టంట్స్‌ : నిక్ ప‌వ‌ల్, సౌండ్ డిజైన్ : ర‌సూల్ పూకుట్టి కొరియోగ్ర‌ఫి : వైభ‌వి మ‌ర్చంట్‌ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌ : తోట విజ‌య భాస్క‌ర్ అండ్ ఎకా ల‌ఖాని వి ఎఫ్ ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్‌ : క‌మ‌ల్ క‌న్న‌న్‌  ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ : ఎన్‌.సందీప్‌, హెయిర్‌స్టైల్‌‌ : రోహ‌న్ జ‌గ్ట‌ప్‌  మేక‌ప్‌ : త‌ర‌న్నుమ్ ఖాన్  స్టిల్స్‌ : సుద‌ర్శ‌న్ బాలాజి  ప‌బ్లిసిటి డిజైన‌ర్‌ : క‌బిలాన్‌ పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను  కాస్టింగ్ డైర‌క్ట‌ర్‌ : ఆడోర్ ముఖ‌ర్జి  ప్రోడక్షన్ డిజైనర్ : ర‌‌వీంద‌ర్‌  చిత్ర స‌మ‌ర్ప‌కులు : "రెబ‌ల్‌స్టార్" డాక్ట‌ర్ యు వి కృష్ణంరాజు   నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌శీదా  దర్శకుడు : రాధాకృష్ణ కుమార్.
 

Follow Us:
Download App:
  • android
  • ios