గూగుల్‌లో ఇప్పటి వరకు మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీల లిస్టులో సన్నీలియోన్ అగ్రస్థానంలో ఉండేది. అయితే ఇపుడు సన్నీని వెనక్కి నెట్టేసి ప్రియా వారియర్ మొదటి స్థానంలో నిలిచింది. కోట్లాది మంది ఫ్యాన్స్ 'ఓరు అడార్ లవ్' సినిమాలోని ప్రమోషన్ సీన్ లో ఆమె కన్నుకొడుతున్న షాట్ సంచలనం అయింది. కళ్లతో ఆమె పలికించే హావభావాల్లో ఒక మత్తు ఉండటంతో అంతా ఫ్లాట్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఆమెకు ఇపుడు కోట్లాది మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు.

 

ఆ వీడియో పుణ్యమా అని ప్రియా వారియర్‌పై అన్ని సినిమా ఇండస్ట్రీల కన్ను పడింది. టాలీవుడ్ లో నిఖిల్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం ప్రియా ప్రకాశ్‌ను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆమెకు డిమాండ్ భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. నిఖిల్-తరుణ్ భాస్కర్ మూవీ కోసం ప్రియా వారియర్ డేట్స్ చూస్తున్న దర్శకుడు ఒమర్ లులును సంప్రదించగా రెండు కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నారు.

 

‘ఓరు అడార్ లవ్' టీజర్‌లో ప్రియా వారియర్ తన ప్రియుడి పైకి ప్రేమ తుపాకి ఎక్కుపెట్టింది. ముద్దులనే బుల్లెట్లుగా మార్చి అతడి గుండెల్లో కసిగా దించేసింది. ఈ టీజర్ కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో వైరల్ అవ్వడంతో పాటు ట్రెండింగ్ లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. ‘ఓరు అడార్ లవ్' చిత్రం మార్చి 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రియా వారియర్ అందానికి దేశం మొత్తం ఫిదా అవ్వడంతో... మున్ముందు అమ్మడు ఏ రేంజికి వెళుతుందో అంటూ చర్చించుకుంటున్నారు.