సోషల్ మీడియా రోజుల్లో ప్రతీ విషయం జనాలు ప్రతీ క్షణం గమనిస్తూనే ఉంటున్నారు. ముఖ్యగా సెలబ్రెటీలు ఏదన్నా చిన్న పొరపాటు చేసినా దాన్ని హైలెట్ చేస్తూ ట్రోల్ చేసేదాకా నిద్రపోవటం లేదు. ఈ విషయం తెలిసినా కూడా కొన్ని సార్లు అడ్డంగా దొరికిపోతున్నారు...అల్లరైపోతున్నారు. ఇప్పుడు ప్రియా ప్రకాష్ వారియర్ పరిస్దితి అదే. ఆమె చేసిన చిన్న పొరపాటు ఇప్పుడు నెటిజన్లకు పండుగ చేసుకునేలా మారింది. వారు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇంతకీ ఆమె చేసిన పొరపాటు ఏమిటీ అంటే..

రీసెంట్ గా ప్రియా ప్రకాష్ .. ఓ పర్‌ఫ్యూమ్ ప్రమోషనల్ యాక్టివిటీలో పాల్గొన్నది. ఈ సందర్భంగా ఆ బ్రాండ్‌కు ప్రమోట్ చేస్తూ దిగిన ఫోటోలను ప్రియా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. తర్వాత ఆ పోస్ట్‌కు క్యాప్షన్ కూడా పెట్టింది. అక్కడే పప్పులో కాలేసింది. ఆ పోస్ట్‌కు ఏం క్యాప్సన్ ఇవ్వాలో ఆ బ్రాండ్ వాళ్లు తనకు కంటెంట్ ఇచ్చారు. ఆ కంటెంట్ ముందు టెక్స్ కంటెంట్ ఫర్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ అని రాసి ఉంది. అంటే..దాని అర్దం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినప్పుడు ఈ కంటెంట్ పెట్టాలని అర్థం.

అయితే.. ప్రియా మాత్రం గుడ్డెద్దు చేలో పడినట్లు..ఆ  సూచనలుని కూడిన ఆ కంటెంట్‌ను కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. దాంతో ఎప్పుడు ఇలాంటి అవకాసం దొరుకుతుందా అని ఎదురుచూసే నెటిజన్లు రెచ్చిపోయారు. ప్రియా చేసిన తప్పును కనిపెట్టిన నెటిజన్లు తనను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కాపీ పేస్ట్ చేయడం కూడా సరిగ్గా రాదా? అంటూ తనపై కామెంట్ల తో రచ్చ రచ్చ చేసారు. కాసేపటికి తను చేసిన పొరపాట  గ్రహించుకున్న ప్రియ తన పోస్ట్‌ను సరిచేసుకుంది ప్రియా.