కాజువల్ గా  అలా  కన్ను కొట్టి కుర్రాళ్ల హృదయాలను దోచేసుకుంది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఏడాది క్రితం కరిలీజైన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్‌ లవ్‌’ టీజర్‌ ఓ సెన్సేషన్ అయ్యింది. అందులో ప్రియా కన్ను కొట్టడం అనేది వైరల్‌ అయ్యింది. ముఖ్యంగా తెలుగునాట ఆమె అందరికీ తెగ నచ్చేసింది. ఇక్కడ కొంతమంది ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్ గా అడిగారు కూడా.  అయితే అత్యుత్సాహంతో ఆమె తన క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకుంది. 

కోటి రూపాయలు తన రెమ్యునేషన్ గా కోట్ చేసింది. దాంతో అందరూ కంగారు పడ్డారు. ఓ కొత్త అమ్మాయి కు ఎప్పుడూ అంత పెద్ద మొత్తం ఇవ్వలేదని...చెప్పి చూసారు. అయినా ఆమె ఒప్పుకోలేదు. దాంతో వాళ్లంతా ‘లవర్స్‌ డే’రిలీజ్ అయ్యాక...దాని రిజల్ట్ ని బట్టి తమ సినిమాల్లోకి తీసుకుందాం అని వెయిట్ చేసారు. అయితే సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆమెను ఇప్పుడు తెలుగులో అడిగేవాళ్లే లేని పరిస్దితి ఏర్పడబోతోంది. ఓ రకంగా ఆమె గొయ్యి ఆమే తీసుకున్నట్లు అయ్యింది. 

రోషన్, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నటించిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్‌ లవ్‌’. ఈ చిత్రానికి ఒమర్‌ లులు దర్శకత్వం వహించారు. సుఖీభవ సినిమాస్‌ పతాకంపై ఎ.గురురాజ్, సి.హెచ్‌. వినోద్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. తెలుగులో ‘లవర్స్‌ డే’ పేరుతో ఈ నెల 14న పేమికుల దినోత్సవం రోజున విడుదల అయ్యింది. ప్రియా ప్రకాష్ కు పెద్ద మార్కులు పడలేదు. క్యూట్ గా ఉంది కానీ నటన అంతంత మాత్రమే అని తేల్చేరు. దాంతో నిన్న ప్రియా ప్రకాష్ అనే క్రేజి బెలూన్ పేలిపోయినట్లైంది.