అడల్ట్ సైట్స్ లో టాప్ హీరోయిన్లు.. ఒక్కొక్కరికి ఒక్కో రేట్!

Principal arrested for uploading morphed images of heroines
Highlights

టెక్నాలజీ పెరిగిందని సంతోషించాలో.. లేక బాధపడాలో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి.

టెక్నాలజీ పెరిగిందని సంతోషించాలో.. లేక బాధపడాలో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఇదే టెక్నాలజీను వాడుకొని స్టార్ హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి ఏకంగా అడల్ట్ సైట్ లో అప్ లోడ్ చేశాడు. అంతటితో ఆగాడా..? అంటే లేదు. ఒక్కొక్కరికి ఒక్కో రేట్ చొప్పునఆన్ లైన్ లో అమ్మకాలు షురూ చేశాడు. ఈ సైట్ లో టాప్ హీరోయిన్లు కూడా ఉండడం షాక్ కు గురి చేసింది.

ఆ సెలబ్రిటీల కోసం కొందరు ఆన్ లైన్ ద్వారా డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేశారు . ఇప్పుడు ఈ వ్యవహరం మొత్తం వెలుగులోకి వచ్చింది. నటి అపూర్వ ఫోటోలు కూడా ఇదే విధంగా మార్ఫింగ్ చేసి ఆమెకు రూ.40 వేలు రేట్ ఫిక్స్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ లో దిల్ సుఖ్ నగర్ కు చెందిన కాలేజ్ లో ప్రిన్సిపాల్ గా పని చేసిన ఓ వ్యక్తి ఇదంతా చేస్తున్నాడని తెలుసుకొని పోలీసులు ఆయన్ను అరెస్ట్ 
చేశారు.

నిందితుడు పెట్టిన పోస్టుల్లో హీరోయిన్ల ఫోటోలతో పాటు కాలేజ్ అమ్మాయిల ఫోటోలు కూడా ఉన్నాయి. డబ్బుని సులభంగా పొందవచ్చనే ఆలోచనతో ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విటుల నుండి రెండు లక్షల వరకు నగదు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. 


 

loader