మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కూడా అరుదైన గౌరవం దక్కబోతోంది. ఏకంగా భారత  ప్రధాని మోదీ, దిగ్గజ క్రికెటర్  సచిన్ తో  ఆయన స్టేజీ షేర్ చేసుకోబోతున్నారు. అవును ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఇంతకీ విషయం ఏంటీ అంటే..? 

ఆస్కార్ లో మనహీరోల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. మన సినిమా దమ్ము బాలీవుడ్ కు తెలిసింది. తెలుగు సినిమాను చులకనగా చూసినవారికి టాలీవుడ్ పవరేంటో తెలిసోచ్చింది. ఇకఈక్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్, చరణ్ గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ హీరో ఇమేజ్ వచ్చేసింది. హాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్లు కూడా వచ్చేస్తున్నాయట. ఇక ఈక్రమంలో రామ్ చరణ్ కు అరుదైన గౌరవం కూడా దక్కబోతోంది. ఆస్కార్ అవార్డు ఫంక్షన్ కోసం అమెరికా వెళ్లిన ఆర్ఆర్ఆర్ టీమ్ గత కొద్ది రోజులుగా అక్కడ సందడి చేసింది. సినిమా ప్రమోషన్స్ తో తెగ హడావిడి చేసింది. మొత్తానికి ఆస్కార్ సాధించి తిరిగి రాబోతున్నారు. ఈరోజు ఆర్ఆర్ఆర్ టీమ్ స్వదేశానికి రాబోతున్నారు. మూవీ టీమ్ కు గ్రాండ్ వెల్కం చెప్పడానికి ఇండియా ఎదురుచూస్తోంది. 

ఈక్రమంలో వారు ఇండియాకు వచ్చిన కొన్నిరోజులకే న్యూఢిల్లీలో జరగబోయే ఇండియా టుడే కాన్ క్లేవ్ లో రామ్ చరణ్ జాయిన్ కాబోతున్నాడు. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఈ ఈవెంట్ కు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. మోదీతో పాటు క్రికెట్ దేవుడు సచిన్ కూడా ఈ ఈవెంట్ లో పార్టిస్పేట్ చేయబోతున్నరట. ఆస్కార్ తరువాత చరణ్ ఈ ప్రోగ్రామ్ కు రాబోతుండటంతో.. అక్కడ మెగా హరోని ఘనంగా సన్మానించడానికి ఏర్పాట్లు జరగబోతున్నట్టు తెలుస్తోంది. 

న్యూఢిల్లీలో ఈనెల 17,18 తేదీల్లో జరగబోతున్న ఈ ఈవెంట్ లో ప్రధాని మోదీ, దిగ్గజ సచిన్ కలిసి చరణ్ ను సన్మానించబోతున్నారట. మన తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచం నలుమూలల చాటిచెప్పినందుకుగానూ చరణ్ ని ప్రధాని మోదీ సన్మానించబోతున్నారని తెలుస్తోంది. అంతే కాదు ఇదే స్టేజీపై నుంచి రామ్ చరణ్ మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి.. ఈసినిమాను ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లిన విధానం, గ్లోబల్ వైడ్ సక్సెస్ కావడంతో పాటు ఆస్కార్ గెలుచుకోవడం లాంటి విషయాలు చరణ్ వివరించే అవకాశం ఉంది. 

ఇక రామ్ చరణ్ కు దక్కబోయే అరుదైన గౌరవం గురించి తెలిసి మెగా ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. ఓ తెలుగు హీరోకు ఈ రేంజ్ ఆదరణ దక్కడం అందరూ గర్వించదగ్గ విషయమని నెట్టింట్ట పోస్టర్లతో ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు చరణ్ ఇంకా ఏ విషయాలు మాట్లాడుతారో అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అంతే కాదు ముందుగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు గ్రాండ్ గా వెల్కం చెప్పడానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.