చిరంజీవి పేరుతో ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభం కానున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది నిజమే కానీ.. ఈ విద్య సంస్థలతో మెగాస్టార్ చిరంజీవికి గాని మెగా ఫ్యామిలిలో సబ్యులకు గాని ఎలాంటి సంబంధం లేదని సంస్థ సిఇఓ జె.శ్రీనివాసరావు తెలిపారు. 

కేవలం అభిమానంతోనే చిరంజీవి పేరును పెట్టుకున్నట్లు చెప్పారు. సంస్థలో చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబులను ఫౌండర్, అధ్యక్షుడు, ఛైర్మన్‌లుగా నియమించడానికి కారణం కూడా అదే అంటూ ప్రెస్ నోట్ లో వివరణ ఇచ్చారు. దిగువ మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు మెరుగైన విద్యను అందించడమే తమ లక్ష్యమని మెగా అభిమానిగా సేవా దృక్పధంతో ఈ స్కూల్స్ ని స్టార్ట్ చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. 

శ్రీకాకుళంలో మొదటి బ్రాంచ్ ను స్టార్ట్ చేసి తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో  చిరంజీవి ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ ని స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు.  అయితే మెగా అభిమానుల్లో నిన్నటి నుంచి ఈ న్యూస్ పై పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది. బ్లడ్ బ్యాంక్ - ఐ బ్యాంక్ తరహాలో మెగాస్టార్ విద్యారంగంలో కూడా సేవ కార్యక్రమాలను మొదలుపెట్టడం మంచి విషయమని పైగా విద్యను పేదలకు అందిస్తే మెగాస్టార్ స్థాయి ఇంకా పెరిగే అవకాశం ఉందని అంతా భావించారు. 

అలాగే మెగా అభిమానుల పిల్లలకు కూడా స్కూల్స్ లో ప్రత్యేక రాయితీలు ఇస్తున్నట్లు నిన్నటివరకు టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు తప్పుడు ప్రచారం జరిగిందని వివరణ ఇవ్వడంతో మెగా అభిమానులకు ఈ ప్రకటన కాస్త నిరాశను కలిసాగిస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ న్యూస్ మరింత వైరల్ గా మారింది.