కంగనా రనౌత్ ఊహించని షాక్ ఎదురైంది. ఇటీవల కంగనా రనౌత్ జడ్జిమెంటల్ హై క్యా చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ విలేఖరితో వివాదానికి దిగింది. దాని ఫలితంగా ఆమెపై ఎంటర్టైన్మెంట్ మీడియా ప్రతినిధులు బ్యాన్ విధించాలని భావించారు. తాజాగా వారి నిర్ణయానికి మద్దతు తెలుపుతూ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. 

తన మణికర్ణిక చిత్రం గురించి వ్యతిరేకంగా రాశాడనే కోపంతో కంగన సదరు మీడియా ప్రతినిధితో వాగ్వాదానికి దిగింది. ఈ సంఘటనపై స్పదించిన జడ్జిమెంటల్ హై క్యా చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ బహిరంగంగా జర్నలిస్టులకు క్షమాపణ తెలిపారు. కానీ కంగనా రనౌత్ మాత్రం క్షమాపణలు కోరలేదు. 

దీనితో జర్నలిస్టుల్లో కంగనాపై ఆగ్రహం మరింతగా పెరిగింది. ఈ మేరకు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనని విడుదల చేసింది. కంగనా రనౌత్ మీడియా ప్రతినిధిని దూషించడం సహించరాని చర్యగా వారు పేర్కొన్నారు. ముంబైలోని ఎంటర్టైన్మెంట్ జర్నలిస్టులు కంగనా రనౌత్ ని బ్యాన్ చేయాలనే నిర్ణయానికి మా మద్దతు తెలుపుతున్నాం అంటూ ప్రకటన విడుదల చేశారు. 

మణికర్ణిక చిత్రం గురించి తప్పుగా ఎలా రాస్తారు..ఆ సినిమాలో నేను నటించడం తప్పా అంటూ కంగనా రనౌత్ మీడియా సమావేశంలో విలేకరిపై విరుచుకుపడ్డారు.