Asianet News TeluguAsianet News Telugu

రీ-రిలీజ్ కాబోతున్న ప్రేమదేశం సినిమా, 25 ఏళ్ల క్రితం కుర్రాళ్లను ఉర్రూతలూగించిన ప్రేమ కావ్యం

ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. జనాలను ఉర్రూతలూగించిన సినిమాలు ఈమధ్య ఎక్కువగా రీ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. హీరోల బర్త్ డేలు అయిన.. సినిమా రిలీజ్ అయ్యి ఎక్కువ ఏళ్లు అయినా.. రీ రిలీజ్ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఇక ఇప్పుడు ప్రేమ దేశం వంతు వచ్చింది. త్వరలో రి రీలీజ్ కు రెడీ అవుతోందీ ప్రేమ కావ్యం. 

Prema Desam Movie Re-release on December 9
Author
First Published Dec 3, 2022, 5:30 PM IST

ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. జనాలను ఉర్రూతలూగించిన సినిమాలు ఈమధ్య ఎక్కువగా రీ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. హీరోల బర్త్ డేలు అయిన.. సినిమా రిలీజ్ అయ్యి ఎక్కువ ఏళ్లు అయినా.. రీ రిలీజ్ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఇక ఇప్పుడు ప్రేమ దేశం వంతు వచ్చింది. త్వరలో రి రీలీజ్ కు రెడీ అవుతోందీ ప్రేమ కావ్యం. 

 చాలా కాలంగా రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు ఇప్పటికే చాలా రీ రిలీజ్ లు అయ్యాయి. ఇక ఇప్పుడు మరో బ్యూటిఫుల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..ముస్తఫ్పా.. ముస్తఫ్ఫా అంటూ స్నేహం విలువ చెప్పిన సినిమా.. నను నేనే విడిచిన  అంటూ.. ప్రేమ విలువ చెప్పిన సినిమా.. పాతికేళ్ళ క్రితం అప్పటి కుర్రాళ్ళను ఉర్రూతలూగించిన మూవీ ప్రేమదేశం రీ రిలీజ్ కాబోతోంది. 

1996లో రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అప్పటి ప్రేమకథా చిత్రాల్లో సరికొత్త ఒరవడిని తీసుకొచ్చి, ఒక సంచలనంగా మారింది. అంతే కాదు యూత్ లో  ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.. ఈ సినిమాతోనే టబు తమిళ తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇక ఈ మూవీ పాటల గురించి చెప్పాలంటే.. అవి ఎవర్ గ్రీన్ అనే అనాలి. ఏఆర్ రెహ్మాన్ కంపోజ్ చేసిన ఆ పాటలు.. ఇప్పటికీ ఫ్రెష్ ప్లేవర్ ను అందిస్తుంటాయి. ఇప్పటి యూత్ కు కూడా కనెక్ట్ అయ్యేలా ఆ పాటలు కంపోజ్ చేశాడు రెహమాన్. 


కదిర్ దర్శకత్వం వహించిన ఈమూవీ ఎవర్ గ్రీన్ గా నిలిచింది. అటు టుబుకి.. అబ్బాస్ కు వినిత్ కు మర్చిపోలేని మెమరీగా నిలవడమే కాకుండా.. వారికి వరుస అవకాశాలు తెచ్చిపెట్టింది సినిమా. తమిళ్, తెలుగు ఇండస్ట్రీస్‌లోని లవ్ స్టోరీస్‌లో.. యూత్ ఫేవరెట్ ఫిల్మ్స్ లిస్టులో ఈ సినిమా కచ్చితంగా ఉంటుంది. తమిళంలో కాదల్ దేశం  పేరుతో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాను వారంలోపే ప్రేమదేశం పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. . 


మౌత్ టాక్‌ తోనే ఈమూవీ పబ్లిసిటీ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమాను యూత్ బాగా ఆదరించారు. కాలేజీల్లో సినిమా పాటలు మారు మోగేవి.  అప్పట్లోనే  అదిరిపోయే కలెక్షన్లతో ఓ ఊపు ఊపేసింది.. యువత అంతా కాలేజీకి బంక్ కొట్టి మరీ ఈ సినిమాకెళ్లేవారంటే అర్థం చేసుకోవచ్చు.. ఇక దాదాపు  25 ఏళ్ళ తరువాత ఈ క్రేజీ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. టెక్నికల్‌గా కొన్ని మార్పులు చేసి.. డిసెంబర్ 9న హైదరాబాద్‌లో రీ రిలీజ్ చేస్తున్నారు.. ఈ సినిమా కోసం అప్పటి ప్రేమదేశం ఫ్యాన్స్ తో పాటు.. ఇప్పటి యూత్ కూడా ఎదురు చూస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios