కరోనా సెకండ్ వేవ్ నడుస్తోంది. చాలా దారుణంగా ఉంది పరిస్దితి. ఈ పరిస్దితులపై రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సినిమాలు వస్తాయి. అయితే ఈలోగా కరోనా కోసం తయారు చేసిన వాక్సిన్ వికటిస్తే..దాంతో జాంబిలు తయారైతే అనే ఇంట్రస్టింగ్ పాయింట్ తో , రాయలసీమ నేపధ్యంలో ఓ సినిమా చేసారు. ‘జాంబిరెడ్డి’ టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం హాలీవుడ్‌ చిత్రాలకు మాత్రమే పరిమితమైన ‘జాంబి’ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కి విజయం సాధించింది.తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ చిత్రం నిర్మాతకు మంచి లాభాలే తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే దర్శకుడు ప్రశాంత్ వర్మ..ఈ సినిమాకు సీక్వెల్ రెడీ చేస్తున్నారు.

ఈ సీక్వెల్ ను పట్టాలెక్కించే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయనీ, కరోనా ప్రభావం తగ్గగానే షూటింగు మొదలుకావొచ్చని చెబుతున్నాడు. ఈ సీక్వెల్ లో సెకండ్ వేవ్ నేపధ్యం ఉంటుందని అంటున్నారు. ఈ సారి మరింత ఫన్ తో ఈ సినిమా సాగుతుందని, జాంబీలను ఈ సారి మరింత కామెడీ చెయ్యబోతున్నారట.

 డైరెక్టర్‌ మాట్లాడుతూ.. ‘ జాంబిరెడ్డిని 500 థియేటర్లలో విడుదల చేశాం. సినిమా రూ.15కోట్లు వసూలు చేసింది. జాంబిరెడ్డిని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. తేజకు హీరోగా తొలి సినిమానే మంచి విజయం దక్కింది. థియేటర్‌లో చూడలేనివారికోసం ఓటీటీలో విడుదల చేసాం. దీనికి కొనసాగింపుగా ‘జాంబిరెడ్డి2’ను త్వరలోనే తెరకెక్కిస్తాం’ అని ప్రశాంత్‌వర్మ అన్నారు.

ఇక తేజ సజ్జా హీరోగా ఆనంది, దక్ష కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘జాంబిరెడ్డి’. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 5న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది తెలుగులో వచ్చిన తొలి జాంబి సినిమా. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ వేదికైన ఆహాలో ప్రసారం అవుతోంది.