Asianet News TeluguAsianet News Telugu

#Hanuman సినాప్సిస్, స్టోరీ లైన్ ఇదే

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా 2024 జనవరి 12న రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తయ్యాయి. 

Prashanth Varma clears speculations and reveals #Hanuman story plot jsp
Author
First Published Jan 1, 2024, 3:21 PM IST


 ఈ సంక్రాంతి రేసులో వెనక్కి తగ్గక, పట్టుదలగా నిలబడ్డ హనుమాన్ (హను-మాన్) చిత్రం కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో మొదటి సూపర్ హీరో సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నారు. టీజర్, పాటలు, ట్రైలర్.. ఇలా అన్నీ ఈ మూవీపై  ఎక్సపెక్టేషన్స్ ని ఓ రేంజికి  తీసుకెళ్లాయి. బడ్జెట్ పరంగా చిన్న చిత్రమే అయినా.. పెద్ద సినిమాలా క్రేజ్ ఉండటమే కలిసి వస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా 2024 జనవరి 12న రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తయ్యాయి. అయితే రవితేజ ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పటంతో ...అసలు రవితేజ పాత్ర ఏమిటి..చిరంజీవి కూడా ఉన్నారా... రవితేజ నే హనుమాన్ అవుతారా వంటి డౌట్స్ కు దర్శకుడు క్లారిఫై చేసారు. ఈయన మాటల్లో ఈ సినిమా కాన్సెప్టు ఏమిటనేది బయిటకు వచ్చింది. 

ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..“నేను ఈ సినిమా చుట్టూ అల్లుకున్న అనుమానాలు, స్పెక్యులేషన్స్ క్లియర్ చేయాలనకుంటున్నాను. ఈ సినిమాలో తేజ ..ఓ నార్మల్ పర్శన్. హనుమంతుడు నుంచి సూపర్ పవర్స్ వచ్చిన దగ్గర నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆ సూపర్ పవర్స్ తో తేజ ఎలా కొంతమంది విలన్స్ నుంచి  అంజనాద్రి అనే ఊరుని కాపాడాడు అనే పాయింట్ సినిమా రూపొందింది  ,” అన్నారు.

ఇక  ఈ చిత్రం నైజాం రైట్స్ ని మైత్రీ మూవీస్ వారు సొంతం చేసుకున్నారు. ఈ రైట్స్ నిమిత్తం ₹7.2 కోట్లు వెచ్చించి తీసుకున్నట్లు సమాచారం. ఓ రకంగా దిల్ రాజు నుంచి నైజాం ఏరియా సినిమాలు మెల్లిగా మైత్రీ వారు సొంతం చేసుకుంటన్నట్లు అర్దమవుతోంది. ఇన్నాళ్లూ మోనీపలిగా ఉన్న దిల్ రాజుకు మైత్రీ కౌంటర్ ఇస్తోందని అంటున్నారు. ఇక మైత్రీవారు ఈ రేటు ఇవ్వటంతో మిగతా ఏరియాలు కూడా మంచి రేట్లకు బిజినెస్ అవుతున్నాయి. రీసెంట్ గా మైత్రీవారు ప్రభాస్ సలార్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. 

ఇక ఇప్పటికే ఈ చిత్రం  టీజ‌ర్, ట్రైల‌ర్‌, పాట‌లు ఈ సినిమాపై ఆస‌క్తిని పెంచేశాయి. ఇప్పుడు మ‌రో రవితేజ వాయిస్ మరో ఎట్రాక్షన్ చేరింది.  ఈ సినిమాలో కోటి అనే కోతి  పాత్ర ఒక‌టి ఉంది. సినిమా అంత‌టా ఈ కోతి పాత్ర ఉంటుంది. ఈ పాత్ర‌కు ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్ ఇవ్వటం హైలెట్ గా చెప్తున్నారు. ఈ పాత్ర‌, ర‌వితేజ గొంతులోని ఫన్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకొంటాయ‌ని చిత్ర‌ టీమ్   చెబుతోంది. 

మరో ప్రక్క 2024 సంక్రాంతికు పోటీ ఓ రేంజిలో ఉంది. సంక్రాంతి రిలీజ్ కోసం  తెలుగు స్టార్ హీరోలంతా తమ సినిమాలతో ఆల్రెడీ కర్ఛీప్ వేసేసారు.  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం”, విక్టరీ వెంకటేష్ “సైంధవ్”, రవితేజ లేటెస్ట్ మూవీ “ఈగల్”, కింగ్ నాగార్జున “నా సామి రంగ”, తేజ సజ్జ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “హనుమాన్” వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాయి. అయితే బయ్యర్లు మాత్రం గోలెత్తిపోతున్నారు. మరో ప్రక్క థియేటర్స్ సమస్య వస్తుంది. నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios