Asianet News TeluguAsianet News Telugu

2023 డిసెంబర్ మాములుగా ఉండదు.. ‘సలార్’ రిలీజ్ పై ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్!?

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘సలార్’ రిలీజ్ ఎప్పుడు? ఈ ఏడాది డిసెంబర్ లోనా? లేదంటే వచ్చే ఏడాది సమ్మర్ లోనా? అనే సందేహాలకు ప్రశాంత్ నీల్ భార్య లేటెస్ట్ పోస్ట్ తో క్లారిటీ ఇచ్చింది. 
 

Prashanth Neel Wife Likitha Reddy post goes Viral NSK
Author
First Published Sep 26, 2023, 7:50 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం Salaar : Part 1  - Ceasefire. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’తో ప్రశాంత్ నీల్ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టారు. దీంతో ‘సలార్’ సినిమాకు రిలీజ్ సందర్భంగా మార్కెట్ లో హైడిమాండ్ ఏర్పడింది. ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘సలార్’ వాయిదా అంటూ మేకర్స్ బిగ్ షాక్ ఇచ్చారు. పైగా మరో డేట్ నూ కన్ఫమ్ చేయలేదు. 

సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ‘సలార్’ నెక్ట్స్ రిలీజ్ డేట్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. ఈ ఏడాది డిసెంబర్ 22న విడుదల కాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇదే అంశంపై ఇండైరెక్ట్ గా ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆమె లేటేస్ట్ గా ఇన్ స్టా హ్యాండిల్ లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. సలార్ రిలీజ్ పైనే స్పందించారని అభిమానులు భావిస్తున్నారు. 

లిఖితా రెడ్డి పోస్టులో.. ’2023 డిసెంబర్ మునుపటిలా ఉండదు. నేనూ ఎదురుచూస్తున్నాను.‘ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నెట్టింట ‘సలార్’ రిలీజ్ ఎప్పుడనేదే హాట్ టాపిక్ గ్గా మారింది. ఈ క్రమంలో లిఖితా రెడ్డి పరోక్షంగా సలార్ రిలీజ్ డిసెంబర్ లోనే కన్ఫమ్ అయ్యిందని తెలియజేశారంటున్నారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కానీ, మరికొందరు మాత్రం ‘సలార్’ వీఎఫ్ఎక్స్ వర్క్ హెవీగా ఉందని, మరిన్ని సీన్లను రీషూట్ కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నారని, అందుకే ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో రానుందని అంటున్నారు. ఇక అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు ఉండటంతో ఆ రోజు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఏదేమైనా ప్రశాంత్ నీల్ భార్య పెట్టిన పోస్ట్ సలార్ గురించే అయినా.. నిజంగానే ఈ డిసెంబర్ మునుపటిలా ఉండదనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆమె పోస్ట్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘సలార్’లో ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్. పృథ్వీ రాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి, జగపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రవి బర్సూర్ సంగీత దర్శకుడు.

Prashanth Neel Wife Likitha Reddy post goes Viral NSK

Follow Us:
Download App:
  • android
  • ios