Asianet News TeluguAsianet News Telugu

#NTRNEEL ఎన్టీఆర్ ని కలిసిన ప్రశాంత్ నీల్, డిస్కషన్ ఏంటంటే...

. జూనియర్ ఎన్టీఆర్ కోసం నీల్ ఒక సాలిడ్ యాక్షన్ మూవీని రెడీ చేస్తాడని అభిమానులు అంటున్నారు. అయితే నీల్ యాక్షన్ ఎమోషనల్ స్టోరీని రెడీ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. 

Prashanth Neel met NTR at his residence on Sunday jsp
Author
First Published Jan 29, 2024, 10:56 AM IST | Last Updated Jan 29, 2024, 10:56 AM IST


ప్రభాస్‌తో 'సలార్' సినిమా చేస్తున్న సమయంలోనే తన నెక్స్ట్ సినిమా జూ.ఎన్టీఆర్‌తో ఉంటుందని ప్రశాంత్ నీల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు.  ఇక సలార్ సూపర్ హిట్టయ్యాక ఈ కాంబోపై ఇంకా ఆసక్తి పెరిగింది. ఈ నేఫధ్యంలో   నిన్న ఆదివారం రాత్రి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలిసినట్లు తెలుస్తోంది. ఇది చాలా కీలకమైన మీటింగ్ చాలా విషయాలు మాట్లాడుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు షూట్ మొదలెడదాం..గెటప్ ఎలా ఉండబోతోంది..ఆ లుక్ కోసం ఎన్టీఅర్ ఏం చేయాలి... ఎప్పుడు రిలీజ్ వంటి విషయాలు డిస్కస్ చేసే అవకాసం ఉంది. అతి త్వరలోనే ఈ కాంబోపై డిటేల్స్ చెప్తూ అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది. 
 
ఇక యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ‘కేజీయఫ్‌’ సిరీస్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వాటి తర్వాత ప్రశాంత్‌ తెరకెక్కించిన చిత్రం కావడం, ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించడంతో ‘సలార్‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  అందుకు తగ్గట్లే సినిమా వర్కవుట్ అయ్యింది. ఈ క్రమంలో ఆ మధ్యన  ఎన్టీఆర్‌ (NTR)తో తాను తెరకెక్కించబోయే సినిమా అప్‌డేట్‌ ఇచ్చి.. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) అభిమానుల్లో ఆసక్తి పెంచారు. 

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసే పని మొదలుపెట్టాను. అయితే ఎన్టీఆర్ ‘దేవర’తో పాటు ఓ హిందీలో వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఎన్టీఆర్ తో నేను చేయబోయే సినిమాకు సరైన టైం కోసం వేచి చూడాల్సివస్తోంది. దాని గురించి ప్రస్తుతానికి మాట్లాడలేను అన్నాడు.

ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. “నేను జూనియర్ ఎన్టీఆర్ కోసం ఇప్పటివరకు చేయని పాత్రను, కథను సినిమా చేయబోతున్నాను. యంగ్ ఎన్టీఆర్ కూడా మునుపెన్నడూ చూడని విధంగా కనిపించనున్నాడు. ఈ కథ నా మామూలు స్టైల్‌లో ఉండదు, దానికి బదులుగా సినిమాలో ఎమోషన్‌ ప్రధాన అంశంగా ఉంటుంది అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కోసం నీల్ ఒక సాలిడ్ యాక్షన్ మూవీని రెడీ చేస్తాడని అభిమానులు అంటున్నారు. అయితే నీల్ యాక్షన్ ఎమోషనల్ స్టోరీని రెడీ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పనిచేస్తున్నారు. ఈ సినిమా తర్వాత జూ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమాలో నటించనున్నాడు. ఈ చిత్రానికి బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే ప్రశాంత్ నీల్-జూ ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ ప్రారంభం కానుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనుంది.

ఇప్పటి వరకు తాను తీసిన చిత్రాలకు అది విభిన్నంగా ఉంటుందని తెలిపారు. కానీ, ఆ కథ ఏ నేపథ్యంలో సాగుతుందో చెప్పేందుకు నిరాకరించారు. ప్రేక్షకులు యాక్షన్‌ చిత్రమని భావిస్తున్నారని, జానర్‌ ఏదైనా అది వారికి బాగా కనెక్ట్‌ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ  ఏడాది ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.  #NTR31, #NTRNEEL అనేవి వర్కింగ్‌ టైటిల్స్‌గా ఉన్నాయి. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘దేవర’ (Devara)తో బిజీగా ఉన్నారు. శివ కొరటాల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా తొలి భాగం 2024 ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios