Asianet News TeluguAsianet News Telugu

టైప్ చేస్తుంటే నా చేతులు వణుకుతున్నాయి: హీరోయిన్

ప్రముఖ నటుడు అర్జున్  సోదరుడి కుమారుడు, కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. చిరంజీవి సర్జా హఠాన్మరణం చెందగా, శాండల్ వుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అతి చిన్న వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించగా, పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయమై  తన ట్విట్టర్ ఖాతాలో స్పందించింది హీరోయిన్ ప్రణీత.

Pranitha Pays Tribute To Chiranjeevi Sarja
Author
Hyderabad, First Published Jun 8, 2020, 9:11 AM IST

ప్రముఖ నటుడు అర్జున్  సోదరుడి కుమారుడు, కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. చిరంజీవి సర్జా హఠాన్మరణం చెందగా, శాండల్ వుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అతి చిన్న వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించగా, పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయమై  తన ట్విట్టర్ ఖాతాలో స్పందించింది హీరోయిన్ ప్రణీత.

"చిరు అకాల మరణ వార్త విని షాక్ కు గురయ్యాను. నాకు నోట మాటలు రావడం లేదు. ఇది నేను టైప్ చేస్తుంటే నా చేతులు వణుకుతున్నాయి. అతను ఎంతో అద్భుతమైన నటుడే కాకుండా, చాలా మానవత్వాన్ని ప్రదర్శించే వ్యక్తి. ఆయన జీవితానికి చాలా అన్యాయం జరిగింది. చిరంజీవి భార్య మేఘనకు, అర్జున్ కు వారి కుటుంబీకులకు, సన్నిహితులకు ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి" అని ఓ ట్వీట్ పెట్టింది. చిరంజీవి సర్జాతో కలిసి ప్రణీత 'విజిల్' అనే సినిమాలో నటించింది. 2013లో ప్రశాంత్ రాజ్ దర్శకత్వంలో ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా కన్నడనాట మంచి విజయాన్ని అందుకుంది.

 చిరంజీవి సర్జా వయసు 39 సంవత్సరాలు. శనివారం మధ్యాహ్నం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండడంతో చిరంజీవి సర్జాను బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అయితే, మృత్యువు ఆ యువనటుడ్ని కబళించింది. ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి సర్జా కార్డియాక్ అరెస్ట్ తో మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. చిరంజీవి సర్జా... అర్జున్ సోదరుడు కిశోర్ సర్జా కుమారుడు. చిరంజీవి సర్జా 2009లో వాయుపుత్ర చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. కన్నడ నాట రీమేక్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు. కెరీర్ లో ఎదుగుతున్న సమయంలో  అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం కుటుంబసభ్యులను, సాటి నటీనటులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.  

Follow Us:
Download App:
  • android
  • ios