`పోకిరి` సినిమాల్లో బ్రహ్మానందం ఓవరాక్షన్‌కి బిచ్చగాళ్లు ఏ రేంజ్‌లో ఆడుకున్నారో తెలిసిందే. ఆ సీన్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. తాజాగా అలాంటి సీన్‌ రియల్‌ లైఫ్‌లో జరిగింది. బాలయ్య హీరోయిన్‌ ప్రగ్యాజైశ్వాల్‌కి ప్రత్యక్షంగా ఎదురైంది.

`పోకిరి` సినిమాల్లో బ్రహ్మానందం ఓవరాక్షన్‌కి బిచ్చగాళ్లు ఏ రేంజ్‌లో ఆడుకున్నారో తెలిసిందే. ఆ సీన్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఆద్యంతం కామెడీని పండించింది. తాజాగా అలాంటి సీన్‌ రియల్‌ లైఫ్‌లో జరిగింది. బాలయ్య హీరోయిన్‌ ప్రగ్యాజైశ్వాల్‌కి ప్రత్యక్షంగా ఎదురైంది. యాచకులు ప్రగ్యా చుట్టిముట్టి దానం చేయమని ఎగబడ్డారు. పిల్లలు, పెద్దలు ఒకేసారి ప్రగ్యాని చుట్టముట్టడంతో ఉక్కిరి బిక్కిరయ్యారు. అయితే `పోకిరి` సినిమాల్లో మాదిరి వీరేం ఆమెని ఇబ్బంది పెట్టలేదు. కానీ తమకు తోచిన సాయం చేయమని తమదైన స్టయిల్‌లో వేడుకున్నారు. 

అయితే పాపం ప్రగ్యా వద్ద మనీ లేనట్టుంది. తన కారు డ్రైవర్‌ వద్ద మనీ తీసుకుని వారికి ఇచ్చింది. వాటిని తలా కొంత పంచుకోమని చెప్పింది. ఈ ఆసక్తికర సంఘటన హకీం హలీమ్‌ సెలూన్‌ వద్ద చోటు చేసుకుంది. ఈ సంఘటనని మొత్తం ఒకరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా అది ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఈ సంఘటనలో ప్రగ్యా సైతం వారిపై విస్సుకోకుండా వారిని కొద్ది డబ్బుతో మ్యానేజ్‌ చేసి కారులో అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. 

YouTube video player

ప్రగ్యా జైశ్వాల్‌ ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న `అఖండ` చిత్రంతో ఆయన సరసన నటిస్తుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌ సరసన `అంతిమ్‌` చిత్రంలో నటిస్తుంది ప్రగ్యా.