నా పర్సనల్ లైఫ్ వార్తలు ఆధారాలు లేకుండా రాయొద్దు.. ప్రగతి ఫైర్
వ్యక్తిగత జీవితం గురించి ఇలా హద్దులు దాటి రాయకూడదు అని, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పారు.
ఆర్టిస్ట్ గా ప్రగతి కు ఓ రేంజి ఫాలోయింగ్ ఉంది. తల్లిగా ఎన్నో సినిమాల్లో చేసిన ఆమె సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలపై స్పందిస్తూ ఉంటారు. ఇక ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమె ఓ ప్రముఖ నిర్మాతను పెళ్లి చేసుకోబోతోందంటూ కొన్ని న్యూస్ సైట్లలో వార్తలు కూడా వచ్చాయి. అయితే, ప్రగతి రెండో పెళ్లి వార్తల్లో నిజం లేదని తేలింది. ఆ వార్తలన్నీ ఒట్టి రూమర్లే అని వెల్లడైంది. రెండో పెళ్లి వార్తలపై నటి ప్రగతి తాజాగా స్పందించారు. పెళ్లి వార్తలు రాసిన వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా ప్రగతి మీడియాతో మాట్లాడుతూ....."అలాంటి వార్తలు చూడగానే చాలా బాధ వేసింది. ఆలా ఎలా రాస్తారు, ముందుగా అడగాలి కదా, ఆధరాలు లేకుండా ఆలా రాయటం బాధ్యతా రాహిత్యం అవుతుంది. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి ఆలా రాయడం తప్పు, నేను నటిని కదా అని మీ ఇష్టం వచ్చినట్టు రాస్తే నేను వాటిని ఖండిస్తున్నాను. ఇకముందు మీరు రాయాలని అనుకున్నప్పుడు అడిగి తెలుసుకొని రాయండి," అని చెప్పారు ప్రగతి.
ఇక ప్రగతి (Pragathi)ఈమధ్య బరువులు ఎత్తి మహిళలు కూడా పురుషులతో సమానంగా ఏదైనా చెయ్యగలరు అని నిరూపించి చూపించారు. అలాగే కొన్ని పోటీల్లో కూడా పాల్గొన్నారు ఈమధ్య శ్రీకాకుళం జిల్లా రాజాం లో జరిగిన మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని బహుమతి కూడా గెలుచుకున్నారని తెలిసింది.ఇలాంటివి ఏమైనా ఉంటే, తాను మీడియా వాళ్ళతోటే ముందుగా షేర్ చేసుకుంటాను అని, ఇలాంటివి రాయటం వలన, తన ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందని చెప్పారు ప్రగతి. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి ఇలా హద్దులు దాటి రాయకూడదు అని, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పారు. ప్రగతి ఇప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా వున్నారు. ఈ సంవత్సరం చిరంజీవి (Chiranjeevi) నటించిన 'భోళా శంకర్' #BholaaShankar సినిమాలో ఆమె నటించారు.