“ఈ సినిమా కోసం రెమ్యునేషన్ తీసుకోలేదు. నేను నా నిర్మాతతో ఏం చెప్పానంటే... సినిమా విడుద‌లై, నిర్మాత‌లు సేఫ్ అయిపోయి, లాభాలొస్తే.. అప్పుడు తీసుకుంటాను అన్నానని“  చెప్పుకొచ్చాడు ప్ర‌దీప్‌. త‌న రెమ్యునేషన్ గా అనుకున్న ఎమౌంట్ డ‌బ్బుల్ని మంచి టెక్నీషియ‌న్స్ ని తీసుకోవ‌డంలో వాడ‌మ‌ని నిర్మాత‌ల‌కు స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. అందుకే ఈ సినిమాకి మంచి టెక్నీషియ‌న్లు కుదిరారు. బ‌డ్జెట్ కూడా ఎక్కువ‌గానే అయ్యింది అని చెప్పారు. ఇక సాధారణంగా ప్రదీప్ టీవీలో చేసే  ఒక్కో ఎపిసోడ్‌కీ మినిమం 50 వేలైనా తీసుకుంటాడు. అలాంటి యాంక‌ర్ సినిమా చేస్తున్నాడంటే, రెమ్యునేషన్ కాస్తంత ఎక్కువగా  డిమాండ్ చేస్తాడ‌ని అనుకుంటాం. అయితే త‌న తొలి సినిమాకి పారితోషికం పైసాకూడా తీసుకోలేదని చెప్పి షాక్ ఇచ్చారు.

ఇక ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ కథలో వేరియేషన్స్‌ నాకు బాగా నచ్చాయి. నేను తెలుగు ప్రేక్షకులందరికీ బాగా తెలుసు. అలాంటప్పుడు ఓ చందమామ కథతో వస్తేనే బాగుంటుందని అనిపించింది. నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ‘నీలి నీలి ఆకాశం’ పాటలో గెటప్‌ కోసం మూడు నెలలు కష్టపడ్డా! అన్నారు.

అలాగే మెగాస్టార్‌ చిరంజీవిగారు, రవితేజగారు ఇలా పలువురు హీరోలు నాకు స్ఫూర్తి. ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్‌ లేకుండా పైకి వచ్చారు. కథను నమ్మి వాళ్లు సినిమాలు చేశారు. ఈ సినిమా మొదటి కాపీ చూసిన తర్వాత నాకు అదే నమ్మకం కలిగింది. మంచి సినిమా తీశామన్న సంతృప్తి కలిగింది.

అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేని పదిమందికి సినిమా చూపించాం. వాళ్లందరూ ఎమోషన్ కి గురయ్యారు. సినిమా బాగుందని మెచ్చుకున్నారు. అలాగే తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నా. ఒక పాటకు 300 మిలియన్‌ వ్యూస్‌ రావటం మామూలు విషయం కాదు. ఆటంకాలు ఎన్ని ఎదురైనా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం అన్నారు ప్రదీప్.