బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని షోలతో పాపులారిటీ బాగానే సంపాదించాడు. '100% లవ్', 'అత్తారింటికి దారేది' వంటి సినిమాల్లో చిన్న పాత్రలు కూడా పోషించాడు.

ఇప్పుడు ఏకంగా హీరోగా వెండితెరకి పరిచయం కానున్నాడు. ఈ మధ్యకాలంలో చాలా మంది యాంకర్లు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ప్రదీప్ కూడా  చేరబోతున్నాడు.

దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానప్పటికీ సినిమా మాత్రం షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తోంది. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన మున్నా అనే వ్యక్తి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు.

1947వ కాలంలో జరిగే కథ నేపధ్యంలో సినిమా సాగుతుంది. దీనికి అనూప్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది.