యూనివర్సల్  స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదే. పాన్ ఇండియా రేంజ్ లో ఓ వెలుగు వెలుగుతున్న ఈస్టార్ హీరో కెరీర్ బిగినింగ్ లో టర్నింగ్ పాయింగ్ గా నిలిచిన సినిమను మరోసారి రిలీజ్ చేయబోతున్నారట . 

యూనివర్సల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదే. పాన్ ఇండియా రేంజ్ లో ఓ వెలుగు వెలుగుతున్న ఈస్టార్ హీరో కెరీర్ బిగినింగ్ లో టర్నింగ్ పాయింగ్ గా నిలిచిన సినిమను మరోసారి రిలీజ్ చేయబోతున్నారట . 

ప్రభాస్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీస్ ఉన్నాయి. అలా హిట్ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటై ఓ స్పెషల్ ఇమేజ్ తో పాటు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో వర్షం సినిమా ఒకటి. 2004 లో రిలీజ్ అయ్యి.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది సినిమా. 

అప్పట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన ఈ సినిమాను రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 22 మరియు 23 తేదీలలో ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు టీమ్. మరి ఇప్పటికే తెలుగు లో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్ లను అందుకున్నాయి. మరి వర్షం సినిమా ఏ రేంజ్ కలెక్షన్ లను అందుకుంటుందో చూడాలి.

వర్షం సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది. ఈ మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా త్రిష నటించి మెప్పించింది. ఇక ఈ వర్షం మూవీ లో ప్రభాస్ - త్రిషల కెమిస్ట్రీ.. వీరిద్దరి మధ్య రొమాన్స్ అప్పట్లోనే అద్భుతంగా రిలీస్ చేసుకున్నారు ఆడియన్స్. వీరిద్దరి జంటకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాకు మ్యూజిక్ లెజెండ్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎం ఎస్ రాజు నిర్మించిన ఈ మూవీ లో.. టాలీవుడ్ హీరో గోపీచంద్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ మూవీ ద్వారా ప్రభాస్ కి , త్రిష కి , గోపీచంద్ కి , దేవి శ్రీ ప్రసాద్ కి ఇలా చాలా మందికి టాలీవుడ్ లో మంచి లైఫ్ వచ్చింది. అందరూ అద్భుతమైన క్రేజ్ ను సాధించారు. ఇక రీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి మరి.