`ఆదిపురుష్‌` నుంచి మైండ్‌ బ్లోయింగ్‌ న్యూస్‌ లీక్‌.. నిజమైతే ప్రభాస్‌ ఫ్యాన్స్ కి పండగే

రామాయణ ఇతిహాసంలోని ఇప్పటి వరకు తెలియని కొత్త విషయాలను `ఆదిపురుష్‌`లో చూపించబోతున్నారట. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈసినిమా విడుదల సంచలనంగా మారుతుంది.

prabhas starrer adipurush movie will release update leak its never before

గ్లోబల్‌స్టార్‌ ప్రభాస్‌(Prabhas) నుంచి వరుసగా ఐదు పాన్‌ ఇండియా చిత్రాలు రాబోతున్నాయి. అందులో ఒకటి `ఆదిపురుష్‌`(Adipurush). రామాయణం ప్రధానంగా రూపొందుతున్న చిత్రమిది. రాముడి కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో Prabhas రాముడి పాత్రలో నటిస్తున్నారు. కృతి సనన్‌ సీతగా నటిస్తుంది. రావణుడి పాత్రని బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ పోషిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది.  విజువల్‌ ఎఫెక్స్ కి ఎక్కువగా స్కోప్‌ ఉండటంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్  కార్యక్రమాలు మునిగితేలుతుంది దర్శకుడు ఓం రౌత్‌ టీమ్‌. 

Adipurush చిత్రాన్ని ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్న చిత్ర బృందం గతేడాదిలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దిశగానే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు దర్శకుడు ఓం రౌత్‌.  ఈ చిత్రంతో రామాయణ ఇతిహాసంలోని ఇప్పటి వరకు తెలియని కొత్త విషయాలను `ఆదిపురుష్‌`లో చూపించబోతున్నారట. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈసినిమా విడుదల సంచలనంగా మారుతుంది. భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. 

సినిమాని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఏకంగా 20వేల థియేటర్లో సినిమాని రిలీజ్‌ చేయాలని, దాదాపు పదికిపైగా భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడీ ప్రభాస్‌ అభిమానులను ఖుషీ చేస్తుంది. గతంలో `బాహుబలి2`, `దంగల్‌` చిత్రాన్ని భారీగా విడుదల ప్లాన్‌ చేశారు. కానీ ఇప్పుడు `ఆదిపురుష్‌` దాన్ని మించి ఎక్కువ థియేటర్లలో రిలీజ్‌ చేయాలని, సరికొత్త రికార్డ్‌ని క్రియేట్‌ చేయాలని `ఆదిపురుష్‌` టీమ్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు టాక్‌. 

ప్రభాస్‌ `బాహుబలి` తర్వాత ఇలాంటి కాస్ట్యూమ్‌ బేస్డ్ చిత్రం చేస్తుండటంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. అయితే సినిమాకి సంబంధించిన అప్‌డేట్లు పెద్దగా లేకపోవడంతో కాస్త నిరాశగా ఉన్న అభిమానులకు ఈ లేటెస్ట్ గాసిప్‌ ఊపుని తీసుకొస్తుంది. ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక ప్రభాస్‌ నటించిన `రాధేశ్యామ్‌` చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా, కరోనా థర్డ్ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు రిలీజ్‌ అనేదానిపై క్లారిటీ లేదు. సమ్మర్‌కి ప్లాన్‌ చేస్తున్నట్టు టాక్‌. కరోనా తగ్గుముఖం పట్టాక సినిమాని విడుదల చేస్తామని యూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించగా, రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు. దీంతోపాటు `సలార్‌`, `ప్రాజెక్ట్ కే` చిత్రాల్లో ప్రభాస్‌ నటిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios