సారాంశం

సలార్ మూవీ విడుదలకు సిద్ధమైంది. మరో రెండు వారాల్లో థియేటర్స్ లోకి రానుంది. సలార్ సెన్సార్ పూర్తిగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుండి ఆయన స్థాయి సినిమా రాలేదు. సాహో కనీసం హిందీలో హిట్ కొట్టింది. రాధే శ్యామ్, ఆదిపురుష్ మొత్తంగా డిజాస్టర్ అయ్యాయి. వందల కోట్ల నష్టాలు మిగిల్చాయి. ఒక భారీ మాస్ కమర్షియల్ హిట్ కొట్టాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వారి ఆశలు సలార్ మూవీతో తీరుతాయని గట్టిగా నమ్ముతున్నారు. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ కోసం ఇండియా వైడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. 

సెప్టెంబర్ 28న సలార్ విడుదల కావాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో సలార్ విడుదలకు సిద్ధం అవుతుంది. రిలీజ్ కి మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. దీంతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారు. అనూహ్యంగా సెన్సార్ సభ్యులు సలార్ కి 'A' సర్టిఫికెట్ ఇచ్చారు. ఓన్లీ ఫర్ అడల్ట్ మూవీ అని తేల్చారు. 

సలార్ మూవీలో వైలెన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పేందుకు ఇది నిదర్శనం. కాబట్టి ఈ చిత్రాన్ని ఏ విధంగాను చిన్నపిల్లలు చూడకూడదు. ఇక సినిమా నిడివి 2 గంటల 55 నిముషాలు. దాదాపు మూడు గంటల నిడివితో విడుదల చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల పాన్ ఇండియా చిత్రాల డ్యూరేషన్ మూడు గంటలకు తగ్గకుండా ఉంటుంది. 

ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే వ్యూస్ లో రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఇది ఇద్దరు మిత్రుల కథ. మితృడు పృథ్విరాజ్ సామ్రాజ్యాన్ని కాపాడేందుకు, అతని ఆధిపత్యాన్ని నిలబెట్టేందుకు సైన్యంలా వచ్చిన మిత్రుడిగా ప్రభాస్ నటిస్తున్నాడు. ట్రైలర్ లో సలార్ కథపై హింట్ ఇచ్చేశాడు ప్రశాంత్ నీల్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతిబాబు, బాబీ సింహ కీలక రోల్స్ చేస్తున్నారు. 

Prabhas Look : ‘కల్కి’ టీమ్ తో నెట్ ఫ్లిక్స్ సీఈవో... ప్రభాస్ న్యూ లుక్ చూశారా.! వైరల్ గా మారిన పిక్