ప్రభాస్‌ నుంచి ఓ షాకింగ్‌ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం నాలుగు ప్యాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్న ఆయనుంచి ఓ గూస్‌ బమ్స్ తెచ్చే అప్‌డేట్‌ వైరల్‌ అవుతుంది. ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ప్రభాస్‌ త్వరలో ఓ హాలీవుడ్‌ సినిమా చేయబోతున్నారనే వార్త సంచలనం సృష్టిస్తుంది. పాపులర్‌ హాలీవుడ్‌ సినిమా సిరీస్‌ `మిషన్‌ ఇంపాజిబుల్‌ 7`లో ప్రభాస్‌ నటించబోతున్నారనేది ఈ నయా అప్‌డేట్‌. క్రిస్టోఫర్‌ మెక్‌ క్వారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో హాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ టామ్‌ క్రూజ్‌తో కలిసి ప్రభాస్‌ నటించనున్నారని టాక్‌. 

ఈ సినిమాలో నటించేందుకు ఇండియా నుంచి ప్రభాస్‌ ముందుకొచ్చారని ఇటీవల దర్శకుడు క్రిస్టోఫర్‌ మెక్‌ క్వారీ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. `రాధేశ్యామ్‌` కోసం ప్రభాస్‌ ఇటలీ వెళ్లినప్పుడు `మిషన్‌ ఇంపాజిబుల్‌7` స్క్రిప్ట్ ని విన్నారని, కథ నచ్చడంతో ప్రభాస్‌ వెంటనే ఓకే చేశారని తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో ఆయన పాల్గొన్నారని టాక్‌. ఇటలీలో ఉన్నప్పుడే ఆయన `మిషన్‌ః ఇంపాజిబుల్‌7` కి సంబంధించిన యాక్షన్‌ సీన్స్ కూడా పూర్తి చేశారని టాక్‌. మరి ఇందులో నిజమెంతా? ప్రభాస్‌ ది ఇందులో కీలక పాత్రనా? లేక గెస్ట్ రోలా? అనేది తెలియాల్సి ఉంది. 

కానీ ఈ వార్త మాత్ర సోషల్‌ మీడియాలో సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇక ప్రభాస్‌ ప్రస్తుతం `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. దీంతోపాటు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో `సలార్‌` సినిమా చేస్తున్నారు. ఇందులో శృతి హాసన్‌ కథానాయిక. అలాగే హిందీలో `ఆదిపురుష్‌` సినిమా చేస్తున్నారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తుండగా, ఇది రామాయణం ఆధారంగా రూపొందుతుంది. కృతి సనన్‌ సీతగా, సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా నటిస్తున్నారు. ఇవి చిత్రీకరణ దశలో ఉన్నాయి.దీంతోపాటు నాగ్‌ అశ్విన్‌తో ప్రభాస్‌ ఓ సైన్స్ ఫిక్షన్‌ చేయబోతున్నారు. అలాగే హిందీలో `వార్‌` సీక్వెల్‌లో నటించబోతున్నారని టాక్‌.