ప్రస్తుతం చేస్తున్న రాధే శ్యామ్ సినిమా పూర్తి కాకుండానే ప్రభాస్ వరస సినిమాలు ఓకే చేస్తున్నారు. ఇప్పటికే అశ్వనీదత్ నిర్మాతగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్లాన్ చేసారు. ఆ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరో సినిమాని సైన్ చేసినట్లు సమాచారం. తమ సొంత బ్యానర్ యువి క్రియేషన్స్ పై ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు ఓ బాలీవుడ్ డైరక్టర్ ఫైనలైజ్ అయ్యాడని తెలుస్తోంది. ఓ కొత్త తరహా కథాంశంతో ఈ సినిమాని ఒప్పించారని, పూర్తి యాక్షన్ సబ్జెక్ట్ అని అంటున్నారు. ఈ ప్రాజెక్టుని కరుణ్ జోహార్ సెట్ చేసారని బాలీవుడ్ అంటోంది. 

ఇక ప్రభాస్ తాజా చిత్రం విషయానికి వస్తే.. ప్రభాస్ తాజా చిత్రం రాధే శ్యామ్  ఈ నెలాఖరులో లేదంటే ఆగస్టు ఫస్ట్ వీక్‌ లో సెట్స్ కి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. పూజాహెగ్డే హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అరవై ఏళ్ల క్రితం నాటి పీరియాడికల్‌ సబ్జెక్టుతో రూపొందుతోంది, ‘రాధే శ్యామ్‌ ’ అనే టైటిల్ దాదాపు ఖరారైనట్లే. ఈ భారీ బడ్జెట్ ప్యాన్‌ ఇండియా సినిమాకి సంగీత దర్శకుడు ఎవరనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. 

ఓవైపు ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులను మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే మరో ప్రశ్న పలకరిస్తోంది. ఆమధ్య అమిత్ త్రివేది పేరు వినిపించినా తాను కాదని స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. దీంతో ‘సాహో’ తరహాలోనే ఒక్కో పాట ఒక్కో సంగీత దర్శకుడితో చేయించబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.