బద్ధ శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథాంశంతో ‘సలార్‌’ రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగాన్ని ‘సలార్‌ పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌’ పేరుతో విడుదల చేసారు. 

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సలార్‌’ దేశవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అంతటా ఓ రేంజి రెస్పాన్స్‌ రావడంతో భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఆరు షోలు పడ్డాయి. బెనిఫిట్ షో రేట్లు బాగా పలికాయి. ముఖ్యంగా నైజాంలో ఊపు మామూలుగా లేదు. మైత్రీ మూవీస్ వారు డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ చిత్రం నైజాంలో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం గ్రాస్ ₹32 కోట్లు కేవలం నైజాంలోనే వచ్చింది. అందులో షేర్ ₹19.11 కోట్లు (₹22.55 Cr incl GST)! దాదాపుగా ఇది ఆల్ టైమ్ రికార్డ్ క్రిందే చెప్పాలి. అయితే పీవీఆర్, ఐనాక్స్ మల్టీప్లెక్స్ సంస్థలు షోలు దెబ్బ వెయ్యటంతో ఆ రికార్డ్ కు చేరలేదు. ఏదైమైనా ఈ రేంజి కలెక్షన్స్ రికార్డే. అలాగే #Salaar మొదటి వారం రూ. 500 నుంచి 600 కోట్ల గ్రాస్, ఓవరాల్‌గా రూ. 1200 కోట్ల పై చిలుకే గ్రాస్ కలెక్ట్ చేస్తుంది (వరల్డ్‌వైడ్ అన్ని భాషల్లో కలిపి) అని అంచనా.

 #Salaar Ceasefire 1 చిత్రం బద్ధ శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథాంశంతో ‘సలార్‌’ రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగాన్ని ‘సలార్‌ పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌’ పేరుతో విడుదల చేసారు. శ్రుతిహాసన్‌ (salaar heroine) హీరోయిన్‌. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రతినాయకుడు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, దర్శకుడు టీనూ ఆనంద్‌, జగపతి బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘సలార్‌’.. ‘కేజీయఫ్‌’ యూనివర్స్‌ కు సంబంధం ఉండదని సినిమా స్పష్టం చేసింది.

బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అందుకు కారణం ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్. అలాగే ఆయన క్రేజీ కాంబినేషన్స్. ఈ క్రమంలో ఈ డిసెంబర్ లో రాబోతున్న ప్రభాస్ సలార్ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని అంటాయి. ఈ సినిమాకి కేజీఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో, ఖచ్చితంగా ఈ చిత్రం తప్పకుండా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్మకంతో ఉంది ట్రేడ్. అదే నిజమైంది.