Asianet News TeluguAsianet News Telugu

#Salaar:ఈ లీక్ మ్యాటర్ చాలు, 'సలార్‌' ఎంత భారీగా ఉండబోతోందో చెప్పటానకి


ప్రభాస్ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్న సినిమాల్లో సలార్ ఒకటి. ఈ సినిమాపై ఫ్యాన్స్ కు ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి.  ఇప్పుడు ఈ  సినిమా గురించి మరో వార్త లీక్ అయ్యింది. దాంతో ప్యాన్స్  సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నారు.

Prabhas #Salaar Overseas Theatrical Rights For Both Parts Bagged By Phars Films
Author
First Published Oct 17, 2022, 7:26 AM IST


వరుస పాన్‌ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ ప్రభాస్‌(Prabhas). ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నింటి బడ్జెట్‌ కలిపితే రూ.1000 కోట్లకు  అనేది అంచనా.  కరోనా కారణంగా షూటింగ్ లు  ఆలస్యమయ్యి ఆయా సినిమాల బడ్జెట్‌ కూడా పెరిగిపోయాయి. ముఖ్యంగా  ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'సలార్‌' ది అదే పరిస్దితి అని తెలిస్తోంది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తొలుత అనుకున్న దానికంటే 'సలార్‌' బడ్జెట్‌ కూడా విపరీతంగా పెరిగిపోయినట్లు టాక్‌ వినిపిస్తోంది.

ప్రస్తుతం రూ.250 కోట్లకు పైనే ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తున్నట్లు చర్చ  ఫిల్మ్ సర్కిల్స్ లో నడుస్తోంది. ఇందులో అత్యధిక మొత్తం ప్రభాస్‌కే చెల్లించాల్సి ఉండగా, యాక్షన్‌ సీన్స్ కు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారట. ఈ క్రమంలోనే 'సలార్‌' రెండు భాగాలుగా రెడీ చేస్తున్నట్లు సమాచారం.  ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తేనే ఆ బడ్జెట్‌కు వర్కవుట్‌ అవుతుందని సలహా ఇవ్వటంతో ఆ నిర్ణయం తీసుకున్నారట. ఈ సినిమా రెండు పార్ట్ ల ఓవర్ సీస్ థియేటర్ రైట్స్ ని Phars ఫిల్మ్స్ వారు రికార్డ్ బ్రేకింగ్ రేటుకు తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర టీమ్  నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 

మొదటి పార్ట్ క్లైమాక్స్...వేరే సినిమా (కేజీఎఫ్) ఫ్రాంచైజ్ తో ఇంటర్ లింక్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఫస్ట్ ఫార్ట్ లోని కొన్ని పాపులర్ క్యారక్టర్స్ ..సెకండ్ పార్ట్ లో కనపించనున్నాయి.  మరో ప్రక్క మలయాళీ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలకపాత్రలో కనిపిస్తున్నారు. ఆదివారం పృథ్వీరాజ్‌ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రియులకు 'సలార్‌' టీమ్‌ అదిరిపోయే అప్డేట్​ ఇచ్చింది. 

పృథ్వీరాజ్‌ లుక్‌ని రివీల్‌ చేసింది. ఇందులో ఆయన.. వరదరాజ మన్నార్‌ పాత్రలో యాంగ్రీ లుక్‌లో కనిపించారు. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్‌ రఫ్‌ లుక్‌లో కనిపించనున్నారు. శ్రుతిహాసన్‌, జగపతి బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రం హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటోంది. బిగ్గెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'సలార్‌' రూపొందుతోందని చెప్పటానికి ఇంతక మించి రుజువు ఏం కావాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios