ప్రభాస్ సలార్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ లో ఈ మూవీ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది.
బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన రెండు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం చెందాయి. సాహో హిందీలో విజయం సాధించినప్పటికీ తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఆశించిన విజయం సాధించలేదు. ఇది ఆయన లేటెస్ట్ రిలీజ్ రాధే శ్యామ్ ఘోర పరాజయం చవిచూసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన రాధే శ్యామ్ ప్రభాస్ కెరీర్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన చిత్రంగా రికార్డులకెక్కింది. ప్రభాస్ నుండి ఓ సాలిడ్ హిట్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ప్రభాస్ సలార్ (Salaar)చిత్రంతో ఆ రేంజ్ హిట్ అందుకుంటాడనే విశ్వాసం అందరూ వ్యక్తం చేస్తున్నారు.
కెజిఎఫ్ 2 (Kgf 2)మూవీతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ నుండి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఆకాశానికి చేరాయి. కెజిఎఫ్ 2 ఏకంగా రూ. 1200 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకుంది. ఇక ప్రభాస్ లాంటి మాస్ హీరోని ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో ప్రజెంట్ చేయనున్నాడోనని ఫ్యాన్స్ ఊహల్లో తేలుతున్నారు. కాగా సలార్ చిత్రాన్ని ప్రభాస్ చకచకా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సలార్ 40 శాతం వరకు పూర్తి అయినట్లు సమాచారం.
ఇక సలార్ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ప్రత్యేకమైన సెట్స్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నట్లు సమాచారం. జూన్ 28 నుండి తాజా షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ మేరకు సమాచారం అందుతుంది. ఇక సలార్ 2023 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. కెజిఎఫ్ మేకర్స్ హోమబుల్ ఫిలిమ్స్ సలార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
మరోవైపు ప్రభాస్ (Prabhas)ప్రాజెక్ట్ కె చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా అశ్వినీ దత్ రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. అమితాబ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఇక ప్రాజెక్ట్ కె షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు రాగా పుకార్లంటూ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
