Asianet News TeluguAsianet News Telugu

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, మార్కెట్ లోకి సలార్ షర్ట్స్, కాస్ట్ ఎంతంటే..?

ప్రభాస్  ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. రెబల్ స్టార్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు .. సలార్ సినిమా రిలీజ్ కంటే ముందు.. అదరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. 

Prabhas Salaar Movie Tshirts released In Online market JMS
Author
First Published Nov 26, 2023, 2:19 PM IST


వరుసగా పాన్ ఇండియా సినిమాల ఫెయిల్యూర్ నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తున్నాడు యంగ్ డెబల్ స్టార్ ప్రభాస్. అందుకే రకరకాల ప్రయోగాలు చేస్తూ.. వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తూ.. దూసుకుపోతున్నాడు. ఆమధ్య ఆదిపురుష్ తో వచ్చిన ప్రభాస్ కు నిరాశే ఎదురయ్యింది. ఈక్రమంలో నెక్ట్స్ సలార్ సినిమాతో అలరించడానికి రెడీ అయ్యాడు. కెజియఫ్ సినిమాల దర్శకుడు  ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో  తెరకెక్కిన పాన్ ఇడియా మూవీ సలార్. రిలీజ్ కు ముస్తాబవుతోంది. వచ్చే నెల అంటే డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈసినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు టీమ్. 

Sukumar: టాలీవుడ్ లో సుకుమార్ రికార్డ్, రాజమౌళి తరువాత ప్లేస్ లో లెక్కల మాస్టారు

 క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ అందింది. ఇప్పటికే సలార్ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసిన టీమ్... స్పీడ్ పెంచారు. కాస్త డిఫరెంట్ గా ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ మేకర్స్ సలార్ టీ షర్ట్స్ ను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. 

 

ఈ టీషర్ట్స్ రిలీజ్ చేయడం ద్వారా ప్రభాస్ ఫ్యాన్స్ లోకి ఇవి పెద్ద ఎత్తున వెళ్తాయి.. దాంతో పైసా ఖర్చు లేకుండా పబ్లిసిటీ అవ్వడంతో పాటు.. టీషర్ట్ అమ్మకాల వల్ల బిజినెస్ కూడా అవుతుంది. ఈరకంగా పెద్ద ప్లాన్ వేశారు నిర్మాతలు ఇక సినిమా నిర్మించిన హొంబలె ఫిల్మ్స్ వెబ్ సైట్ ద్వారా వీటిని అమ్మకానికి పెట్టారు. ఒక్కో టీ షర్ట్ ధర 499 నుంచి 1,499 వరకు ఉంది. టీషర్ట్ ను బట్టి వివిధ ధరల్లో అవి అందుబాటులో ఉన్నాయి. 

అంతా బాగుంది కాని.. ఈ ధరల విషయంలో అభిమానులు గుర్రుగా ఉన్నారు. టీషర్టులు, హుడీలు, హార్మ్ స్లీవ్ లను కూడా అమ్మకానికి పెట్టారు సరే.. ఈ రేట్లేంటి అంటూ...  అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అంతలేసి ధరలు పెడితే సామాన్యులు ఎలా కొంటారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీ షర్ట్ కొంటేనే అభిమానం ఉన్నట్లా.. ఇప్పుడు టీ షర్ట్ కోసం అంత డబ్బు పెట్టలేనని మరో యూజర్ కామెంట్ చేశాడు. 

Naresh : ఒకేసారి రెండు సత్కారాలు, అరుదైన గౌరవం పొందిన నటుడు నరేష్

అభిమానుల క్రేజ్ ను ఇలా కూడా క్యాష్ చేసుకుంటున్నారా అంటూ మరికొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. దాంతో ఈ టీషర్ట్ ప్రమోషన్ బెడిసికొట్టేలా కనిపిస్తుంది. అంత ధర పెట్టకుండా సామాన్యులకు, మాస్ జనాలకు అందుబాటులో ఉండేధరను నిర్ణయితే.. పక్కాగాప్రమోషన్ అయ్యేది అంటున్నారు సినీ జనాలు. ఇక ఈమూవీలో సలార్ సరసన శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇండియన్ స్టార్స్ కొంత మంది ఈసినిమాలో సందడి చేయబోతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios