Asianet News TeluguAsianet News Telugu

#Salaar టిక్కెట్ రేట్లు పెంపు, ఎంత ఉండవచ్చు అంటే...

 అదనపు రేట్ల కు ఇప్పటికే చిత్ర నిర్మాతలు తెలంగాణా,ఆంధ్రాలలో  దరఖాస్తు చేసారు. ఆ మేరకు డాక్యుమెంట్స్ సమర్పించినట్లు సమాచారం.  

Prabhas #Salaar Cease Fire - Part 1  makers seek ticket price hikes jsp
Author
First Published Nov 18, 2023, 11:23 AM IST

భారీ బడ్జెట్‌ సినిమాలకు టిక్కెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటును గతంలో ప్రభుత్వాలు కలిపిస్తూ వచ్చాయి. ఇందుకు ప్రత్యేక కమిటీ సూచనల మేరకు నిర్ణయించనున్నట్లు గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. సంక్రాంతి భారీ బడ్జెట్‌తో నిర్మించిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతించాలని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్వహకులు దరఖాస్తు చేసుకున్నప్పుడు సానుకూల స్పందనే వచ్చింది. అలాగే ఆదిపురుష్ సినిమా టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి తెలంగాణ,ఆంధ్రా ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టిక్కెట్‌పై రూ.50 పెంచుకోవడానికి అనుమతి ఇవ్వటం జరిగింది. అయితే మొదటి మూడు రోజులు మాత్రమే పెంపుకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసారు. మళ్లీ ఇప్పుడు సలార్ చిత్రానికి టిక్కెట్ రేటు పెంచుకోవటం కోసం అప్లే చేస్తున్నట్లు సమాచారం.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు #Salaar అదనపు రేట్ల కు ఇప్పటికే చిత్ర నిర్మాతలు తెలంగాణా,ఆంధ్రాలలో  దరఖాస్తు చేసారు. ఆ మేరకు డాక్యుమెంట్స్ సమర్పించినట్లు సమాచారం.  50 నుంచి 75 రూపాయల పెంపు వుండేలా అనుమతి రావచ్చని తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాలకు రేట్లు పెంచకపోతే రికవరీ ఉండకపోవచ్చు అని ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.  

 ఇక ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారనటంలో సందేహం లేదు. ప్రభాస్ ఈ సినిమాపై బాగా నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ ఏడాది ఆదిపురుష్ తో  ప్రభాస్ పెద్ద డిజాస్టర్  అందుకోవడంతో అభిమానులందరూ.. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇంకా  ఈ చిత్రం నిమిత్తం కొన్ని రీ షూట్ లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అద్బుతమైన అవుట్ ఫుట్ తో కేజీఎఫ్ ని మించిన హిట్ ఇవ్వాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు.  ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో సూపర్ బిజీగా ఉంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 22 విడుదల కానుంది.  ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 1న రాత్రి 7.19 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. 

మరో ప్రక్క  బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు మాత్రం తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అందుకు కారణం ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్. అలాగే ఆయన క్రేజీ కాంబినేషన్స్.  ఈ క్రమంలో ఈ డిసెంబర్ లో రాబోతున్న ప్రభాస్ సలార్ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి.   ఈ సినిమాకి కేజీఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో, ఖచ్చితంగా ఈ చిత్రం తప్పకుండా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్మకంతో ఉంది ట్రేడ్. దాంతో డిసెంబర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా షారుక్ ఖాన్ దుంకి సినిమాతో పోటీ పడాల్సి ఉన్నా కూడా లెక్క చేయటం లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ కుమ్మేస్తున్నారు. 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios