టెర్రిఫిక్ : ‘సలార్’ప్రీ రిలీజ్ బిజినెస్ (ఏరియా వైజ్)
ఈ స్దాయి బిజినెస్ కు కారణం.. తెలుగులో కూడా 'కెజియఫ్ 2' మంచి విజయం సాధించటమే. తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోల సినిమాలకు వచ్చే స్థాయిలో వసూళ్ళు వచ్చాయి.
ప్రభాస్ (Prahas)నెక్ట్స్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్’ (Salaar) అన్న సంగతి తెలిసిందే.కేజీఎఫ్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరక్ట్ చేస్తున్న చిత్రం కావటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. పాన్ ఇండియా స్థాయిలో సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌గా సలార్ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించటంతో ప్రభాస్ అభిమానులు ఖుషి అవుతున్నారు . గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. సలార్ సినిమాలో శృతిహాసన్ ప్రధాన పాత్రను పోషిస్తోంది. మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ సలార్ సినిమాను నిర్మిస్తోన్నాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం అదే స్దాయిలో జరుగుతోంది. తెలుగు ఏరియాలో ఏరియా వైజ్ ఆ లెక్కలు చూస్తే ..
ఈ చిత్రం నైజాం ఏరియా 65 కోట్లకు మైత్రీ మూవీస్ వారు సొంతం చేసుకున్నారు. సీడెడ్ రైట్స్ ని అభిషేక్ రెడ్డి 27 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర రైట్స్ ని 20.4 కోట్లకు, ఈస్టో గోదావరి రైట్స్ ని 13.6 కోట్లకు, గుంటూరు రైట్స్ ని 12 కోట్లకు , నెల్లూరు రైట్స్ ని 6.3 కోట్లకు ఇప్పటిదాకా అమ్ముడైనట్లు సమాచారం. వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు ఇంకా ఫైనల్ టాక్స్ జరుగుతన్నాయి. రెండు ఏరియాలు కలిపి 19 కోట్లు దాకా ఉంటుందని అంచనా. ఈ క్రమంలో మొత్తం తెలుగు రెండు రాష్ట్రాల బిజినెస్ 165 కోట్లు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఇదే అత్యథికమైన బిజినెస్. అయితే ఇవన్ని అఫీషియల్ గా బయిటకు వచ్చినవి కాదు. ట్రేడ్ లో చెప్పబడుతున్న లెక్కలు మాత్రమే.
ఇక ఈ స్దాయి బిజినెస్ కు కారణం.. తెలుగులో కూడా 'కెజియఫ్ 2' మంచి విజయం సాధించటమే. తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోల సినిమాలకు వచ్చే స్థాయిలో వసూళ్ళు వచ్చాయి. ఒక్క నైజాంలోనే సుమారు 70 కోట్లు కలెక్ట్ చేసింది. 'సలార్' తీసింది ఆ సినిమా దర్శకుడే కావడం, పైగా ఇందులో తెలుగు హీరో ఉండటంతో హిట్ టాక్ వస్తే 165 కోట్లు రావడం పెద్ద కష్టం ఏమీ కాదు. ఈ సినిమా ఇంకా హైయిస్ట్ బిజినెస్ చేసేదని... మాస్ జానర్ కాబట్టి టెంప్ట్ చేసినా.. 'ఆదిపురుష్' రిజల్ట్ వెంటాటడమే కారణం అంటున్నారు.