Asianet News TeluguAsianet News Telugu

షాక్: #Salaar అక్కడ పెద్ద ప్లాఫ్? .. కారణం ఇదే..

తెలుగులో ఈ సినిమాకు ఎర్లీ మార్నింగ్ షోల నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక్కడ ప్రభాస్ కు ఉన్న మార్కెట్ కు సినిమా టాక్ తోడవటంతో వైల్డ్ ఫైర్ లా మారింది. 

Prabhas #Salaar A big flop in Karnataka? jsp
Author
First Published Dec 26, 2023, 10:13 AM IST

ప్రభాస్  పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హసన్ కీలక పాత్రలు పోషించిన   సలార్ సినిమా తొలి భాగం ‘సలార్- సీజ్ ఫైర్’తెలుగు భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఫస్ట్ పార్ట్ చూసి  రెండో భాగం ‘శౌర్యాంగ పర్వం’ఎప్పుడూ అని అడుగుతున్నారు. అయితే ఇది ప్యాన్ ఇండియా సినిమా. కేవలం తెలుగు మార్కెట్ మాత్రమే కాదు ...హిందీ, కన్నడ, మళయాళ,తమిళ మార్కెట్ లలో కూడా అక్కడ భాషల్లోకి డబ్బింగ్ అయ్యి భారీగా రిలీజ్ అయ్యింది. అక్కడ పరిస్దితి ఏమిటి

తెలుగులో ఈ సినిమాకు ఎర్లీ మార్నింగ్ షోల నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక్కడ ప్రభాస్ కు ఉన్న మార్కెట్ కు సినిమా టాక్ తోడవటంతో వైల్డ్ ఫైర్ లా మారింది. అదే కన్నడంలో ప్రశాంత్ నీల్ కు మంచి మార్కెట్. ఆయన మూడు సినిమాలు ఉగ్రమ్, కేజీఎఫ్, కేజీఎఫ్ 2 లు కన్నడ సినిమాలే. అవి అక్కడ సూపర్ హిట్స్. దాంతో అక్కడ సలార్ కు మంచి బజ్ ఏర్పడింది. రిలీజ్ కు ముందు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కు కటౌట్స్ పెట్టి పాలాభిషేకాలు చేసారు. అయితే రిలీజ్ అయ్యాక సీన్ మారిపోయింది. తాము చూసిన `ఉగ్రమ్` రీమేక్ అని చాలా మంది `సలార్‌` చూపటానికి ఉత్సాహం చూపించటం లేదు. సినిమా అక్కడ ఫెయిల్ ని కన్నడ ట్రేడ్ లెక్కలు చూపెడుతూ...తేల్చేసింది.

వాస్తవానికి ప్రభాస్   బాహుబలి 2 చిత్రం 40 కోట్లు కర్ణాటకలో తెచ్చిపెట్టింది. అక్కడ పెద్ద హిట్. దాంతో అక్కడ అందరికీ ప్రభాస్ బాగా తెలుసు. అయితే సాహో, ఆదిపురుష్ చిత్రాలు అక్కడ ఆడలేదు. వాళ్లు సలార్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఏదో కొత్త కథ తో వస్తాడనుకుంటే కన్నడ రీమేక్ చిత్రంతో రావటం వాళ్లను నిరాశపరిచిందని సోషల్ మీడియాలో వాపోతున్నారు. 

మొదటి నుంచి సలార్ మరోదో కాదు...ఉగ్రం సినిమాను బాగా రిచ్ గా భారీ ఎత్తున తీస్తున్నాడు ప్రశాంత్ నీల్ అంటూ కొందరు సోషల్ మీడియాలో అదే పనిగా ప్రచారం చేశారు. అది కూడా ప్రశాంత్ నీల్ తీసిన సినిమానే!! కానీ కొందరు మాత్రం పనిగట్టుకుని మరీ ఉగ్రం-సలార్ పోలికలు ఇవిగో అంటూ పోస్టులు మీద పోస్టులు పెడుతూ వచ్చారు.  అందులో చాలా వరకూ నిజమే. అయితే సలార్ కు , ఉగ్రంకు ఓ కీలకమైన మార్పు ఉంది.

అదేమిటంటే.. ఉగ్రమ్ లోని చైల్డ్ హుడ్ ఎపిసోడ్ సలార్ లో రిపీట్ అవుతుంది. తన స్నేహితుడికు ఏమి ఇవ్వటానికైనా సిద్దపడతాడు చిన్నప్పుడే హీరో.  ఇక రెండు సినిమాల్లోనూ హీరోలు ఓ రిమోట్ విలేజ్ లో ఉంటారు. అలాగే హీరోయిన్ అమెరికా నుంచి వస్తుంది. ఆమెకు కొన్ని గ్రూప్ ల నుంచి ప్రాణ హాని ఉంటుంది.అక్కడ నుంచే హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది. రెండింటిలోనూ ఇది యాజటీజ్. తన తల్లి మాటపై హీరోయిన్ కు షెల్టర్ ఇవ్వటం కూడా రెండు సినిమాల్లోనూ ఉంటుంది. అయితే అక్కడిదాకా సేమ్ టు సేమ్ వెళ్లిన దర్శకుడు అక్కడే ఓ కొత్త ట్విస్ట్ సలార్ లో  ఇచ్చారు. 

ఉగ్రమ్ చిత్రంలో  అండర్ వరల్డ్ నుంచి హీరోయిన్ కు థ్రెట్ ఉంటుంది. ఇక్కడ సలార్ లో ఖాన్సార్ అనే ఓ ఫిక్షన్ సిటీని క్రియేట్ చేసారు. అదే కీలకమైన మార్పు. అదే సెకండాఫ్ లో వస్తుంది. అండర్ వరల్డ్ పెడితే రొటీన్ అయ్యిపోయేది కానీ కేజీఎఫ్ తరహాలో ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి ముందుకు వెళ్లారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఉగ్రమ్ లో శ్రీమురళి ప్రస్టేషన్ వచ్చినప్పుడు  తన రైట్ హ్యాండ్ ని టైట్ చేసేషాట్ ని యాజటీజ్ వాడారు. ఓ రకంగా అది ఉగ్రమ్ కు హోమేజ్ లా చెప్పాలి. 
 
ఇక సినిమా రిలీజ్ కు ఇంకొన్ని గంటలు సమయం మాత్రమే ఉండగా  ఉగ్రం-సలార్ పోలికపై ప్రశాంత్ నీల్ మాట్లాడారు. ఉగ్రం సినిమాను ఆడియన్స్ మధ్య థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలనుకున్నాను కానీ ఆ సినిమా నేను అనుకున్నంత హిట్ అవ్వలేదన్నారు ప్రశాంత్ నీల్. ఉగ్రం చాలా స్కోప్ ఉన్న కథ.. అందులో చెప్పలేకపోయిన పాయింట్స్‌ను సలార్‌ రూపంలో తీసానన్నారు. అందుకే సలార్ సినిమాలో ఉగ్రం సినిమా పోలికలు కనిపిస్తాయని వివరించారు ప్రశాంత్ నీల్.   

 డిసెంబర్ 22న ‘సలార్’ మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో తెలుగు, కన్నడంతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రేక్షకులు  ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘సలార్’ . ‘కె.జి.ఎఫ్'(సిరీస్) దర్శకుడు ప్రశాంత్ నీల్..  ప్రభాస్ తో చేసిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండటంలో ఓపినింగ్ కలెక్షన్స్ అదిరిపోయాయి.

Follow Us:
Download App:
  • android
  • ios