`చత్రపతి`లో ఫైట్‌ సీన్‌లో చోటు చేసుకున్న ఓ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని ప్రభాస్‌ పంచుకున్నారు. నిజం కర్రతో విలన్‌ సుప్రీత్‌ తనని కొట్టారని, దీంతో తన వీపు పగిలిపోయిందని చెప్పారు. అయితే కర్ర విషయంలో ఏం జరిగిందనే రహస్యాన్ని తాజాగా ప్రభాస్‌ వెల్లడించారు. 

ప్రభాస్‌(Prabhas), రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం `చత్రపతి`(Chatrapathi). 2005లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ప్రభాస్ కెరీర్‌లో అప్పటి వరకు బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇందులో ఇసుకలో, బీచ్‌లో విలన్‌ పాత్ర దారి సుప్రీత్‌, ప్రభాస్‌ మధ్య వచ్చే ఫైట్‌ సీన్‌ హైలైట్‌గా నిలుస్తుంది. చాలా నేచురల్‌గానూ ఉంటుంది. భారీ పర్సనాలిటీ కలిగిన ఇద్దరు ఢీ కొడితే ఎలా ఉంటుందనే దానికి ఈ ఫైట్‌ సీన్‌ అద్దం పడుతుంది. 

తాజాగా ఈ ఫైట్‌ సీన్‌లో చోటు చేసుకున్న ఓ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని Prabhas పంచుకున్నారు. నిజం కర్రతో విలన్‌ సుప్రీత్‌ తనని కొట్టారని, దీంతో తన వీపు పగిలిపోయిందని చెప్పారు. అయితే కర్ర విషయంలో ఏం జరిగిందనే రహస్యాన్ని తాజాగా ప్రభాస్‌ వెల్లడించారు. పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్న ప్రభాస్‌ ప్రస్తుతం `రాధేశ్యామ్‌`(Radheshyam) చిత్రంలో నటించగా, ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద(కృష్ణంరాజు కూతురు) నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా మార్చి 11న విడుదల కాబోతుంది. 

చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ప్రభాస్‌ పాల్గొన్నారు. ఇందులో `చత్రపతి` సినిమా టైమ్‌లో జరిగిన విషయాన్నివెల్లడించారు. `రాధేశ్యామ్‌`కి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్‌ రవీంద్ర గురించి చెబుతూ `చత్రపతి` సినిమా నుంచి ఆయనతో ట్రావెల్‌ అవుతున్నామని తెలిపారు ప్రభాస్‌. ఆయన ఆర్ట్ డైరెక్టర్‌గా ఎంత పర్‌ఫెక్టో వెల్లడించారు ప్రభాస్‌. ఆయన వేసే సెట్‌ ప్రతిదీ చాలా సహజంగా ఉంటుందని, అద్భుతంగా తీర్చిదిద్దుతారని చెప్పారు. ఈ సందర్భంగానే `చత్రపతి` లోని సుప్రీత్‌తో ఫైట్‌ సీన్‌ గురించి చెప్పారు. 

సినిమాలో చిన్న బాలుడి కోసం గీత దాటిన సమయంలో సుప్రీత్‌తో, ప్రభాస్‌కి ఫైట్‌ జరుగుతుంది. ఫస్ట్ టైమ్‌ సినిమాలో ప్రభాస్‌.. విలన్లని ఎదిరిస్తాడు. ఈ ఫైట్‌ గూస్‌బమ్స్ తెప్పించేలా ఉంటుంది. అయితే ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌లో సుప్రీత్‌.. ఓ కర్రతో ప్రభాస్‌ని కొట్టాల్సి ఉంటుంది. అది చాలా ఏళ్లనాటి కర్ర అని, దాన్ని ఆర్ట్‌ డైరెక్టర్‌ చాలా సహజంగా తయారు చేశారని, సముద్రంలో ఉప్పు పట్టి అది ఎలా తయారవుతుందో అలానే రెడీ చేశాడట. ఆ కర్రతో కొడితే గట్టిగా తగిలిందట. తన వీపు పగిలిపోయిందని చెప్పాడు ప్రభాస్‌. ఏంటని ఆర్ట్ డైరెక్టర్‌ని అడిగితే పర్‌ఫెక్షన్‌ అన్నాడట. `నీ పర్‌ఫెక్షన్‌ తగలెయ్యా నా వీపు పగిలిపోయిందని`(నవ్వుతూ) తన ఆవేదన పంచుకున్నాడట ప్రభాస్‌.

తాజాగా `రాధేశ్యామ్‌` ప్రెస్‌మీట్‌లో ఈ విషయాన్నిపంచుకున్నాడు ప్రభాస్‌. ఆయన ప్రతి చిన్నదాని విషయంలోనూ చాలా డిటెయిల్‌ వర్క్ చేస్తారని, ప్రతిదీ సహజంగా ఉండేలా చేస్తారని తెలిపారు. `రాధేశ్యామ్‌` చిత్రంలోనూ 1970 నాటి సెట్‌ని క్రియేట్‌ చేశారని, 1970లో ఇటలీ ఎలా ఉంటుందనేది సెట్‌లో ఆవిష్కరించినట్టు చెప్పారు ప్రభాస్‌. ప్రతి రోజు సెట్‌లోకి వెళితే ఓ ఎగ్జైట్‌మెంట్‌ వస్తుందని పేర్కొన్నాడు.