టాలీవుడ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్ సాహో అనుకున్నట్టుగానే రికార్డులను బద్దలుకొడుతోంది. శనివారం విడుదలైన ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఊహించని విధంగా ఉంటాయని చెప్పవచ్చు. బాహుబలి తరువాత ప్రభాస్ నుంచి వస్తోన్న యాక్షన్ మూవీ కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. 

ట్రైలర్ ను తెలుగు - తమిల్ అలాగే మలయాళం హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేశారు. విడుదలైన కొద్దీ సేపటికే ట్రైలర్ వ్యూవ్స్ తో రికార్డులు సృష్టించింది. విడుదలైన అన్ని భాషల్లో సాహో మొత్తంగా 31 మిలియన్ల యూట్యూబ్ వ్యూవ్స్ ను అందుకుంది. ఈ లెక్కలు ఎక్కడి వరకు వెళతాయో ఊహించడం కష్టమే. 

సుజిత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాహో సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉండడంతో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.