ప్రభాస్ Prabhas నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’ Salaar థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది. ఇంత పెద్ద సక్సెస్ చేసిన సందర్భంగా, న్యూ ఈయర్ వేళ డార్లింగ్ తన అభిమానుల గురించి ప్రత్యేకమైన పోస్ట్ పెట్టారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ Prashanth Neel కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఫిల్మ్ Salaar Cease Fire . డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. పదిరోజుల్లో ఈ చిత్రం రూ.625 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి హౌరా అనిపించింది. అన్నీ చోట్లా ప్రదర్శనలు కొనసాగుతుండటంతో మరింతగా కలెక్షన్స్ రానున్నాయని తెలుస్తోంది. 

అయితే, తాజాగా డార్లింగ్ ‘సలార్’ను ఇంత సక్సెస్ చేసిన అభిమానుల కోసం ప్రత్యేకమైన పోస్ట్ పెట్టారు. అలాగే న్యూ ఈయర్ సెలబ్రేషన్స్ సందర్భంగానూ విషెస్ తెలిపారు. ఇన్ స్టాగ్రామ్ లో తన సంతోషాన్ని వ్యక్తం చేవారు. ‘నేను ఖాన్సార్ ఫేట్ డిసైడ్ చేసేలోగా మీరు న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేస్తూ ఉండండి. సలార్ ను ఓన్ చేసుకుని ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు డార్లింగ్స్ అందరికీ థ్యాంక్స్’. అని పోస్ట్ చేశారు. ప్రభాస్ చేసిన పోస్టుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్పందిస్తూ రిప్లైస్ పంపుతున్నారు. 

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. నెక్ట్స్ పార్ట్ 2గా ‘శౌర్యాంగ పర్వం’ రానుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కొంత మేరకు జరిగినట్టు ప్రచారం. షూట్ ప్రారంభంపై కొద్దిరోజులు వేచి ఉండక తప్పదు. చిత్రంలో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) కథానాయికగా నటించారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, టిన్ను ఆనంద్ కీలక పాత్రలు పోషించారు.