యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 11న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండడంతో చిత్ర యూనిట్ తిరిగి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 11న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండడంతో చిత్ర యూనిట్ తిరిగి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ప్రేక్షకుల్లో తిరిగి ఉత్సాహం నింపేందుకు తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ తో ప్రభాస్ పాత్ర గురించి మరికొన్ని ఇంటరెస్టింగ్ డీటెయిల్స్ చూపించారు. 

ఈ మూవీలో ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడిగా నటించబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పాత్ర పేరు విక్రమాదిత్య. చేతి రాతలు చూసి ఎంతటి వారి భవిష్యత్తు అయినా ఇట్టే చెప్పేయగలడు. ఈ ట్రైలర్ లో ప్రభాస్ సత్తాని పరిచయం చేసే ప్రయత్నం చేశారు. 

'మనం ఆలోచిస్తున్నాం అని భ్రమ పడతాం.. మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయి' అంటూ ప్రభాస్ చెప్పే ఇంట్రెస్టింగ్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ట్రైలర్ లో ప్రభాస్ చెప్పే ప్రతి డైలాగ్ ఉత్కంఠని రేకెత్తిస్తోంది. ఎంతటి వారి జాతకాన్ని, భవిష్యత్తుని అయినా ప్రభాస్ చేతి రాతల్ని బట్టి చెప్పేస్తున్నాడు. 

అది ఎంత కఠోరమైన విషయం అయినప్పటికీ మొహమాటం లేకుండా ప్రభాస్ చెబుతూ చుక్కలు చూపిస్తున్నాడు. 'ఈయన ఎప్పుడు ఎలా చనిపోతాడో చెప్పనా' అనే డైలాగ్ ఇందుకు ఉదాహరణ. జగపతి బాబు కంగారు పడుతూ ఇంకోక్కసారి చూడు అని అడగగా.. నాకు రెండవసారి చూసే అలవాటు లేదు' అని ప్రభాస్ బదులివ్వడం టెర్రిఫిక్ గా ఉంది. 

ఒక ట్రైన్ లో వెళుతున్న ఒక అమ్మాయి తన చేయి చూపించగా.. నీకు స్పోర్ట్స్ వద్దు అని ప్రభాస్ సలహా ఇస్తాడు. ఇక ట్రైలర్ హాఫ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. ప్రేమ విషయంలో ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు అంటూ పూజా హెగ్డే బదులిస్తుంది. అసలు విక్రమాదిత్య తన ప్రేమ గురించి ఏం ప్రిడిక్ట్ చేశాడు.. ప్రభాస్, పూజా మధ్య ఏం జరగబోతోంది ? ఇవ్వన్నీ సినిమాపై ఉత్కంఠని పెంచేసే అంశాలు. అలాగే భారీ షిప్ విజువల్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. 

ట్రైలర్ చివర్లో జక్కన్న రాజమౌళి.. ప్రేమకి విధికి మధ్య జరిగే యుద్ధమే ఇది అంటూ తన వాయిస్ ఓవర్ తో ఆకట్టుకున్నారు. తప్పకుండా రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలని మరో స్థాయికి చేర్చుతుంది అనడంలో సందేహం లేదు. 

YouTube video player