'సాహో' సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రభాస్, అనుష్కల మధ్య ఎఫైర్ రూమర్స్ మరోసారి ఊపండుకున్నారు. వీరిద్దరూ కలిసి అమెరికాలో ఓ ఇల్లు వెతుకుతున్నారని, జపాన్ కి హాలిడే వెళ్తున్నారని, 'సాహో' సినిమాను అనుష్క కోసం స్పెషల్ షో ఏర్పాటు చేస్తున్నారని ఇలా రకరకాల వార్తలు వినిపించడం మొదలుపెట్టాయి. ప్రభాస్ ఎన్ని సార్లు అనుష్క విషయంపై క్లారిటీ ఇస్తున్నా.. ఈ రూమర్లు మాత్రం ఆగడం లేదు.

తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని, కేవలం స్నేహితులు మాత్రమేనని ఒకటికి పదిసార్లు చెబుతున్నా మీడియా మాత్రం ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి రూమర్స్ రావడంతో ప్రభాస్ అసహనం వ్యక్తం చేశాడట. అనుష్కతో ఎఫైర్ గురించి ప్రముఖ మ్యాగజైన్ ప్రభాస్ ని ఆరాతీయగా.. అందులో నిజం లేదని కొట్టిపారేశారట. అనుష్కతో ఎఫైర్ అనేది కేవలం ఊహాగానమేనని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.

గత రెండేళ్ల నుండి తాము కలిసింది కూడా లేదని చెప్పారు. ఒకవేళ తామిద్దరి మధ్య ఏదైనా ఎఫైర్ నడుస్తూ ఉంటే ఎక్కడో ఒకచోట కలిసేవాళ్లం కదా..? అని ప్రశ్నించాడట ప్రభాస్. తామెక్కడా కనీసం కలిసి కూడా కనిపించనప్పుడు ఇలాంటి రూమర్లకు అర్ధం ఏముందని అన్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్-అనుష్క ఇద్దరూ కలిసి సినిమాలు చేయడం, బాహుబలి సినిమా కోసం ఏకంగాఐదేళ్ల పాటు కలిసి వర్క్ చేయడంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు మరింత బలంగా వినిపించాయి. కానీ ఈ జంట మాత్రం ఎప్పటికప్పుడు తమ రిలేషన్షిప్ పై క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ రూమర్లు మాత్రం ఆగడం లేదు.